వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దళిత అక్కాచెల్లెళ్ల రేప్, హత్య: ఆరుగురు నిందితుల అరెస్ట్, పెద్ద ఎత్తున ఆందోళన

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ‌లో 17, 15 ఏళ్ల ఇద్దరు దళిత అక్కా చెల్లెళ్లపైపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, హత్య చేసి, చెట్టుకు వేలాడదీసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాధితుల కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు వారి కుటుంబం గంటల తరబడి బాలికలను దహనం చేయలేదు. దీంతో ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ జరిపి నిందితులకు శిక్షపడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

ఈ జంట హత్యకు పాల్పడిన ఆరుగురిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల్లో సుహైల్, జునైద్, హఫీజుల్ రెహ్మాన్, కరీముద్దీన్, ఆరిఫ్. ఈ వీరికి పరిచయం చేసిన అమ్మాయిల పొరుగువాడైన ఛోటూ అనే ఆరో వ్యక్తిని కూడా పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

UP Dalit Teen Sisters Rape and murder: Six accused arrested, Family Promised Fast-Track Trial

బుధవారం ఐదుగురిని అరెస్టు చేసినప్పటికీ.. తప్పించుకునేందుకు ప్రయత్నించిన జునైద్‌ గురువారం ఉదయం పోలీసులకు పట్టుబడ్డాడు. పారిపోతుండటంతో అతని కాలికి కాల్చి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతన్ని తీసుకువెళుతున్నప్పుడు కుంటుతూ వీడియోలో కనిపించాడు.

బుధవారం మధ్యాహ్నం బాలికలను చెరుకు తోటలోకి తీసుకెళ్లి సుహైల్, జునైద్‌లు అత్యాచారం చేశారని జిల్లా పోలీసు చీఫ్ సంజీవ్ సుమన్ మీడియాకు తెలిపారు. ఇతరులు సాక్ష్యాలను వదిలించుకోవడానికి సహాయం చేశారు.

"పొలాల్లో బాలికలపై అత్యాచారం చేశారు. తమను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో.. నిందితులు వారి గొంతునులిమి చంపారు. ఆపై వారు నేరాన్ని కప్పిపుచ్చడానికి సహాయం కోసం కరీముద్దీన్, ఆరీఫ్‌లను పిలిచారు. వారు మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు. ఆత్మహత్యలా చిత్రీకరించారు' అని పోలీసు అధికారి చెప్పారు.

కాగా, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున బాధితుల కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారితో మాట్లాడారు. నిందితులకు త్వరితగతిన శిక్షపడేలా చూస్తామని పోలీసు అధికారులు వారికి హామి ఇచ్చారు.

English summary
UP Dalit Teen Sisters Rape and murder: Six accused arrested, Family Promised Fast-Track Trial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X