ములాయం కోటరీ కుంపటి: అఖిలేశ్ గట్టెక్కుతారా?

శివ్‌పాల్ యాదవ్ మాత్రం ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత కొత్త పార్టీ స్థాపించేందుకు వెనుకాడనని బహిరంగంగానే ప్రకటించారు.

లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ రాష్ట్ర ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు పలు అభివ్రుద్ధి కార్యక్రమాలు ప్రారంభించి, శంకుస్థాపనచేశారు. కానీ ఇవన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో నిజమైన సమస్యల నుంచి అధికార సమాజ్ వాదీ పార్టీ అధిగమించి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ రెండు రోజుల్లో 300లకు పైగా ప్రాజెక్టుల ప్రారంభం, నాలుగు గంటల వ్యవధిలో రాష్ట్ర రాజధాని లక్నోలో ఏడు ప్రాంతాల్లో రూ.60 వేల కోట్ల విలువైన డజన్ పథకాలకు శంకుస్థాపనచేశారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించకముందే హాస్పిటళ్ల నుంచి స్టేడియం వరకూ, కిసాన్ బజారు మొదలు మిల్క్ ప్రాసెసింగ్ సెంటర్ సహా విస్త్రుత ఏర్పాట్లతో కూడిన ప్రాజెక్టులను ప్రారంభించారు. వాటిల్లో ఆగ్రా - లక్నో ఎక్స్ ప్రెస్ వేను గత నవంబర్ 21న ప్రారంభించారు.

అదే విధంగా గోమతి నదీతీరాన లక్నో మెట్రో రైలు ప్రాజెక్టు ట్రయల్ రన్ కూ పచ్చజెండా ఊపారు. తద్వారా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివ్రుద్ధి చేయగలమన్న సంకేతాన్ని ఇచ్చారు. మరోవైపు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నాయకత్వ స్థానంలో ఉన్న యాదవ కుటుంబంలో కుమ్ములాటల నుంచి జనం ద్రుష్టి మళ్లించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. తర్వాత సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా తండ్రి ములాయం స్థానే యువ నేత - సీఎం అఖిలేశ్ ఎన్నికవ్వడంతో యూపీలో ఆధిపత్య పోరుకు తెర పడింది. అది వేరే సంగతి. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు అఖిలేశ్ యాదవ్ ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన తొలి దశ పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఆయా సమస్యలేమిటో పరిశీలిద్దాం..

UP Election 2017: Akhilesh Yadav's 300 projects are encouraging, but how will SP tackle real issues?

శాంతిభద్రతల్లో ఘోరంగా వైఫల్యం

శాంతిభద్రతల పరిరక్షణలో సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న మాట నిష్ఠూరసత్యం. గత ఐదేళ్లలో నేరాల రేటు భారీగా పెరిగాయన్నదీ వాస్తవమే. పార్టీ అధ్యక్షుడిగా ములాయం స్థానే సీఎం అఖిలేశ్ యాదవ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. కానీ ములాయం సింగ్ యాదవ్ మాత్రం మౌనంగా ఉండకుండా అడపాదడపా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. తద్వారా పార్టీలో వ్యవహారాలపై తన అసంత్రుప్తిని వెల్లగక్కుతూనే ఉన్నారు. మౌన ప్రేక్షకుడిగా ఉండేందుకు నిరాకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తును ప్రశ్నించారు.

ప్రత్యేక పార్టీ పెడతానన్న శివ్‌పాల్

అఖిలేశ్ బాబాయి శివ్ పాల్ యాదవ్ కూడా యూపీ సీఎం ముందు తల వంచుకునేందుకు తిరస్కరిస్తున్నారు. తిరుగుబాటు మనస్తత్వం నుంచి బయటపడలేకపోతున్నారు. సమస్యలను తగ్గించుకునేందుకు అఖిలేశ్ యాదవ్ తన బాబాయి శివ్‌పాల్ యాదవ్ కు టిక్కెట్ ఇచ్చారు. కానీ శివ్‌పాల్ యాదవ్ మాత్రం ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత కొత్త పార్టీ స్థాపించేందుకు వెనుకాడనని బహిరంగంగానే ప్రకటించారు. సమాజ్ వాదీపార్టీలో టిక్కెట్లు నిరాకరించిన వారు ఇతర పార్టీల నుంచి పోటీచేసినా వారి తరఫున ప్రచారంచేస్తానని బాబాయి ప్రకటించారు.

ప్రముఖుల తిరుగుబాటు

ములాయం సింగ్ యాదవ్, శివ్‌పాల్ సింగ్ యాదవ్ లపై ఆధిపత్యం సాధించిన తర్వాత సీట్ల కేటాయింపు అధికారం అఖిలేశ్‌కు లభించడంతో సీనియర్లంతా తిరుగుబాటు బాట పట్టారు. ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడైన సీనియర్ నేత అంబికా చౌదరి నేరుగా మాయావతి సారథ్యంలోని బీఎస్పీలో చేరిపోయారు. మరో సీనియర్ నారాద్ రాయ్.. అజిత్ సింగ్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇంకా పలువురు సీనియర్లు ఇతర పార్టీల బాట పట్టారు.

పూర్తిగా మీడియా మేనేజ్‌మెంట్ పైనే ఆధారం

అఖిలేశ్ యాదవ్ టీం అంతా పూర్తిగా మీడియా మేనేజ్‌మెంట్ పైనే ఆధారపడి ముందుకు సాగుతోంది. హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన స్టీవ్ జార్డింగ్ తాజాగా మీడియా ప్రచారానికి తెర తీశారు. గత నాలుగున్నరేళ్లుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పౌరులను నాలుగున్నర సీఎంలు పాలించారన్న అభిప్రాయం నెలకొంది. ఆ ఐదుగురు సీఎంల్లో ఒకరిగా అఖిలేశ్ యాదవ్‌ను చూశారు. మూడు నెలలుగా వివిధ టీవీ చానళ్లలో వస్తున్న సర్వే ఫలితాలేవీ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించవు. ఉత్తరప్రదేశ్ పౌరుడు కూడా అధ్యయనాలు, సర్వే ఉత్తిదేనని నిర్ధారించుకున్నాడు.

ముల్లా ములాయం మొండి వైఖరి

సమాజ్‌వాదీ పార్టీ పూర్తిగా యాదవ్ - ముస్లింల కాంబినేషన్‌పైనే ఆశలు పెట్టుకున్నది. ఉత్తరప్రదేశ్ ముస్లింలలో ములాయం సింగ్ యాదవ్ ముల్లా ములాయం సింగ్ అని పేరు తెచ్చుకున్నారు. కానీ ప్రస్తుత ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉంటానని ములాయం ప్రకటించడం సమాజ్ వాదీలకు పరిస్థితి క్లిష్టమైన పనే మరి. రాష్ట్రంలో ముస్లింల జనాభా 20 శాతం. ప్రత్యర్థి పార్టీ బీఎస్పీ 403 స్థానాల్లో 97 స్థానాల్లో ముస్లింలను బరిలో నిలిపింది. అన్ని పార్టీలు అదే బాటలో టిక్కెట్లు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీని ఫలితంగా ముస్లింల ఓట్లు ఐదో శాతం నుంచి ఏడు శాతం ఓట్లను బీఎస్పీ తన ఖాతాలో చేర్చుకున్నది.

యాదవేతర ఓబీసీలపై బీజేపీ కన్ను

మరోవైపు బీజేపీ.. యాదవ్ - ముస్లిం కాంబినేషన్‌ను దెబ్బ తీసేందుకు యాదవేతర ఓబీసీలను తన అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నది. అందుకోసం ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుని మరీ టిక్కెట్లు ఇచ్చేందుకు కమలనాథులు వెనుకాడటం లేదు. ఈ పరిస్థితుల మద్య అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్ వాదీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాదిస్తుందా? లేదా? అన్నది తెలియాలంటే వచ్చేనెల 11 వరకూ వేచిచూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+