ముస్లీంల కంచుకోటలో బీజేపీ పాగా, యూపీ నగరాలు కమలానివే
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం సత్తా చాటింది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న, ముస్లింలకు కంచుకోట అయిన దేవబంధ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బీజేపీ పాగా వేసింది.
లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం సత్తా చాటింది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న, ముస్లింలకు కంచుకోట అయిన దేవబంధ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బీజేపీ పాగా వేసింది.
దేవబంధ్‌లో తొలిసారి బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో ప్రధాని మోడీ హవా కొనసాగిందని ఈ సందర్భంగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో కూడా ఇదే హవా కొనసాగుతుందన్నారు. బీజేపీకి యూపీలో వనవాసం ముగిసిందన్నారు. ఇక రామరాజ్యం ఉంటుందన్నారు.

నగరాల్లో బీజేపీ హవా
యూపీలోని పలు నగరాలు బీజేపీ చేతికి వచ్చేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ నగరాలైన లక్నో, కాన్పూర్, అలహాబాద్‌తో పాటు పలు ప్రధాన నగరాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.












Click it and Unblock the Notifications