అఖిలేష్ యాదవ్ బలహీన బౌలర్; బీజేపీ అభ్యర్థులు బౌండరీలు కొట్టాలి: యూపీలో అమిత్ షా
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్నది. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరినిమించి ఒకరు మాటల తూటాలను పేలుస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను టార్గెట్ చేశారు. భారత్ కు అత్యంత ఇష్టమైన క్రీడల్లో ఒకటైన క్రికెట్ క్రీడతో ప్రస్తుత ఎన్నికలను పోల్చిన అమిత్ షా అఖిలేష్ యాదవ్ ఫుల్ టాస్ వేశారని బిజెపి నుండి బరిలోకి దిగిన అభ్యర్థులు 2022 ఎన్నికలలో కూడా బౌండరీ కొట్టాలని పిలుపునిచ్చారు.

అఖిలేష్ యాదవ్ బలహీన బౌలర్ .. మనం బౌండరీలు కొట్టాలి
2013లో బీజేపీ విజయ్ అభియాన్ ను ఖుషి నగర్ నుంచి ప్రారంభించిందని, 2014లో దేశం మొత్తం మోడీకి మద్దతుగా ఓటేసింది అని అమిత్ షా పేర్కొన్నారు. అఖిలేష్ బాగా బలహీన బౌలర్ అని పేర్కొన్న అమిత్ షా, అతడు వేసే బాల్స్ కు మనం ఫోర్లు కొట్టాలని పిలుపునిచ్చారు. సోమవారం ఖుషి నగర్ లో జరిగిన ర్యాలీలో అమిత్ షా సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమాజ్ వాదీ పార్టీ బహుజన సమాజ్ పార్టీ లు యూపీలో కుల రాజకీయాలకు పాల్పడ్డారని అమిత్ షా ఆరోపించారు.

ఎస్పీ, బీఎస్పీ కుల రాజకీయాలు చేస్తే మేం అందరినీ సమానంగా చూశాం
ఒక ప్రభుత్వం ఒక కులం కోసం, మరొక ప్రభుత్వం మరొక కులం కోసం పని చేశాయని పేర్కొన్నారు. కానీ నరేంద్ర మోడీ హయాంలో యూపీలోని బీజేపీ ప్రభుత్వం సబ్ కా సాత్ సబ్ కా వికాస్ కోసం పని చేసిందని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా చూడాలని ప్రజలను కోరిన అమిత్ షా, రాబోయే ఐదేళ్ల పాటు రైతులు కరెంటు కోసం ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివే పేద కుటుంబాలలో ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ సహాయం అందిస్తుందని పేర్కొన్నారు.

రాష్ట్రం నుండి మాఫియాను, నేరస్థులను తరిమికొట్టారని యోగీకి అమిత్ షా కితాబు
ఉన్నత చదువులు చదివే విద్యార్థినులకు స్కూటీ, యువతకు ఉచితంగా ల్యాప్ ట్యాప్, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. యూపీలో సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రం నుండి మాఫియాను, నేరస్థులను తరిమికొట్టారని అమిత్ షా పేర్కొన్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో సామాన్యులు ఇబ్బంది పడకుండా రేషన్ అందించినట్లుగా అమిత్ షా గుర్తు చేశారు.

అఖిలేష్ బాంబు దాడికి పాల్పడిన వారికి మద్దతు ఇస్తున్నాడు
భారతదేశ సైన్యాన్ని, లేదా భారతదేశాన్ని సరిహద్దులు దాటి ఏదైనా బెదిరింపులతో చూస్తే ఎవరైనా శిక్షించ పడతారని ప్రధాని మోడీ ప్రపంచానికి అర్థమయ్యేలా సందేశం ఇచ్చారని అమిత్ షా గుర్తుచేశారు.ప్రధాని నరేంద్ర మోడీ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఉగ్రవాదం నుంచి కాపాడుతుంటే, అఖిలేష్ యాదవ్ లాంటి వ్యక్తి సంకట్ మోచన్ టెంపుల్ పై బాంబు దాడికి పాల్పడిన వారిపై కేసులు ఉపసంహరించుకోవాలని కోరుతున్నాడని అమిత్ షా ఆరోపణలు గుప్పించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications