UP elections: కేజ్రీవాల్‌ను టెర్రరిస్టు అంటూ ఓట్లు అడగాల్సిన దుస్థితి ఆ పార్టీలది: లక్నోలో అరవింద్ కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ లక్నోలో జరిగిన బహిరంగ సభలో తనపై వచ్చిన ఉగ్రవాది వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన అరవింద్ కేజ్రీవాల్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా వన్ మ్యాన్ ఫోర్స్‌గా కుమార్ విశ్వాస్ ను పిఎం మోడీ నియమించాలని, కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలను సమర్థించడంపై ఎదురుదాడికి దిగారు.

ఉగ్రవాదులను గుర్తించటానికి అన్ని ఏజెన్సీలను తొలగించి ఘజియాబాద్ కవికి ఉద్యోగం ఇవ్వండి
కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని లేదా స్వతంత్ర దేశానికి (ఖలిస్థాన్) ప్రధాన మంత్రి కావాలని కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ లు విరుచుకు పడుతున్నాయి. సోమవారం నాడు లక్నోలో జరిగిన ఒక బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, తనపై బిజెపి ప్రోద్బలంతో అన్ని ఏజెన్సీలు దాడులు నిర్వహించాయి.
కానీ వారికి ఏమీ తన వద్ద లభించలేదని, తాను దాడులకు కారణం అడిగినప్పుడు, ఘజియాబాద్‌కి చెందిన కవి కేజ్రీవాల్ ఉగ్రవాది అని కలలు కన్నారని వారు చెప్పారు. తాను ప్రధాని నరేంద్ర మోడీని అన్ని ఏజెన్సీలను తొలగించి, ఆ కవిని ఉద్యోగంలో ఉంచాలి. అతను ఎవరెవరు తీవ్రవాది అనేది చెబుతాడు అని చెప్పాలనుకుంటున్నాను అంటూ ఎద్దేవా చేశారు.

కుమార్ విశ్వాస్ వ్యాఖ్యల దుమారం.. కేజ్రీవాల్ ను టార్గెట్ చేసిన మోడీ, రాహుల్ గాంధీ
పంజాబ్‌లో జరిగిన ర్యాలీలో, కుమార్ విశ్వాస్ కేజ్రీవాల్ పై చేసిన వ్యాఖ్యలను ప్రజలు గమనించాలని పిఎం మోడీ ప్రజలకు సూచించారు. కేజ్రీవాల్ మరియు అతని పార్టీకి పాకిస్తాన్ వలె "అదే ఎజెండా" ఉంది. భారత్‌ను విచ్ఛిన్నం చేయడం.. అధికారం కోసం వేర్పాటువాదులతో చేతులు కలపడం అని అన్నారు. ఈ అంశంపై కేజ్రీవాల్ స్పందించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ సమాధానం చెప్పడం లేదు.. ఎందుకంటే ఆప్ వ్యవస్థాపకుడు (కుమార్ విశ్వాస్) నిజం చెబుతున్నాడు అని అన్నారు.

తాను అవినీతిపరులను భయపెట్టే ఉగ్రవాదిని అన్న కేజ్రీవాల్
బ్లాక్‌బస్టర్ చిత్రం 'షోలే' నుండి ఒక డైలాగ్‌ను ఉటంకిస్తూ, కేజ్రీవాల్ ఈ రోజు "అవినీతిపరులను భయపెట్టే ఉగ్రవాది" అని అన్నారు. దీనిపై వివరణ ఇస్తూ రెండు రకాల టెర్రరిస్టులు ఉంటారు, ఒకటి ప్రజలను భయపెట్టే వారు, మరొకటి అవినీతిపరులను భయపెట్టే వారు. కేజ్రీవాల్ అవినీతిపరులను భయపెట్టే ఉగ్రవాది. షోలే సినిమాలోని ఒక డైలాగ్ ఉంది. జబ్ బచ్చా భ్రష్టాచార్ కర్తా హై తో మా కెహతీ హై సోజా బేటా వర్నా కేజ్రీవాల్ ఆజాయేగా (ఎవరైనా కొడుకు తప్పు చేస్తే, తల్లి చెబుతుంది. నిద్రపో, లేదంటే కేజ్రీవాల్ వస్తాడు) అని ఆయన అన్నారు.
Recommended Video

70 ఏళ్లుగా బీజేపీ, కాంగ్రెస్‌లు పనేం చెయ్యలేదు.. అందుకే కేజ్రీవాల్ ఉగ్రవాది అని ఓట్ల అభ్యర్ధన
ఆ తర్వాత తన దాడికి మరింత పదును పెడుతూ.. 70 ఏళ్లుగా బీజేపీ, కాంగ్రెస్‌లు పని చేసి ఉంటే, అభివృద్ధి చేసి ఉంటే చేసిన పని పేరుతో ఓట్లు అడిగేవారని.. ఇప్పుడు కేజ్రీవాల్‌ను టెర్రరిస్టు అంటూ ఓట్లు అడగాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. మొదట, దేశంలోని రైతులను ఉగ్రవాదులు అని పిలిచారు మరియు ఇప్పుడు సైకిల్ ఉపయోగించే పేదలందరినీ ఉగ్రవాదులుగా పిలుస్తున్నారు అని కేజ్రీవాల్ అన్నారు.












Click it and Unblock the Notifications