వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్ యాదవ్ పార్టీకి మరో షాక్: బీజేపీలోకి ములాయం సింగ్ సన్నిహితుడు, మరో ఎమ్మెల్సీ కూడా

|
Google Oneindia TeluguNews

లక్నో: మరికొద్ది వారాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి మరో షాక్ తగిలింది. ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) మాజీ నాయకుడు శివ కుమార్ బెరియా సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు సన్నిహితుడు కూడా అయిన శివకుమార్ బెరియా.. ఎస్పీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇది ఇలావుండగా, మరోవైపు ఎస్పీ ఎమ్మెల్సీ రమేష్ మిశ్రా కూడా బీజేపీలో చేరారు.

UP elections 2022: Mulayam Singh Yadavs close aide Shiv Kumar Beria joins BJP.

కాగా, ఇటీవలే బీజేపీని వీడి జనవరి 13న ఎస్పీలో చేరిన ధౌరాహ్రా ఎమ్మెల్యే బాల ప్రసాద్ అవస్తీ మళ్లీ కాషాయ పార్టీలోకి వచ్చారు. ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరిన కొద్ది రోజులకే ఈ చేరికలు జరగడం చర్చనీయాంశంగా మారాయి.

అపర్ణా యాదవ్ 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నుంచి ఎస్పీ టిక్కెట్‌పై పోటీ చేశారు. ఆ తర్వాత ఆమె బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో 33,796 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

భారతీయ జనతా పార్టీలో చేరుతున్నప్పుడు, అపర్ణా యాదవ్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ "ప్రధానమంత్రి నరేంద్ర మోడీచే ప్రభావితమైనట్లు తెలిపారు.

ములాయం సింగ్ యాదవ్ బావ, యూపీ మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా కూడా జనవరి 20న కాషాయ పార్టీలో చేరారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.

నామినేషన్ దాఖలు చేసిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్

మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ కుమార్ యాదవ్ సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. మెయిన్‌పురిలోని కర్హల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అఖిలేష్ తోపాటు పలువురు ఎస్పీ అభ్యర్థులు కూడా తమ నామినేషన్లు దాఖలు చేశారు.

కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన ఆజంగఢ్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. 1993 నుంచి కర్హల్ నుంచి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులే గెలుపొందుతుండటం గమనార్హం. 2002లో మాత్రం ఎస్పీ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ప్రస్తుతం కర్హల్ నుంచి ఎస్పీ నేత సోబరన్ సింగ్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

సొంతపట్టణం నుంచి సైఫై నుంచి కలెక్టరేట్ ఆఫీసుకు వచ్చి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అఖిలేష్ యాదవ్ తోపాటు మరో ముగ్గురు ఎస్పీ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు.

Recommended Video

UP Assembly Elections 2022 : BJP Releases 6th Candidates List | Oneindia Telugu

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో తాను కూడా బరిలో దిగాలని అఖిలేష్ యాదవ్ నిర్ణయించుకున్నారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అర్బన్ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికై నుంచే యూపీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

English summary
UP elections 2022: Mulayam Singh Yadav's close aide Shiv Kumar Beria joins BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X