Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

UP Elections 2022: సమాజ్‌వాదీ ప్రభుత్వమంటే మాఫియా పాలన; ఎస్పీపై విరుచుకుపడిన రాజ్‌నాథ్ సింగ్

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బిజెపికి ప్రచారం చేస్తూ సమాజ్‌వాదీ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన లక్నోలోని కాంట్ అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థి బ్రిజేష్ పాఠక్‌కు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించారు. నిత్యం ప్రజలకు అంకితమయ్యే బ్రిజేష్‌ పాఠక్‌ను భారీ ఓట్లతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

కాంట్ అసంబ్లీలో బ్రిజేష్ పాఠక్‌కు మద్దతుగా రాజ్‌నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం

కాంట్ అసంబ్లీలో బ్రిజేష్ పాఠక్‌కు మద్దతుగా రాజ్‌నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం

యుపి అసెంబ్లీ ఎన్నికలు 2022 కోసం లక్నో కాంట్ అసెంబ్లీలో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సాయంత్రం బిజెపి అభ్యర్థి బ్రిజేష్ పాఠక్‌కు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించారు. కాన్పూర్ రోడ్‌లోని నహరియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రక్షణ మంత్రి ప్రసంగిస్తూ.. ఉత్సాహవంతమైన ప్రజలను చూస్తే అంకితభావంతో పని చేసే బ్రిజేష్ పాఠక్‌ను గెలిపిస్తారని మీ మనసులో ఉన్నట్టు అనిపిస్తోందని అన్నారు. భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని విజ్ఞప్తి చేశారు.

 ఆ పార్టీలు అధికారంలోకి వస్తే అభివృద్ధి రివర్స్ లో

ఆ పార్టీలు అధికారంలోకి వస్తే అభివృద్ధి రివర్స్ లో


సమాజ్‌వాదీ, బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీలు వస్తే, అభివృద్ధి స్రవంతి రివర్స్‌లో పరుగెత్తుతుందని ఆయన పేర్కొన్నారు. వీరికి అవకాశం ఇవ్వటం అంటే మాఫియాకు అడ్డాగా రాష్ట్రాన్ని మార్చటమే అని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఎవరైనా భారతదేశం వైపు దుర్బుద్ధితో చూడాలని ప్రయత్నిస్తే, వారిని మనం తరిమి కొట్టగలమని అంతటి శక్తి బిజెపికి ఉందని పేర్కొన్నారు. యూపీలో దుష్ట శక్తులను తరిమికొట్టాల్సిన బాధ్యత మీదేనని పేర్కొన్నారు. సిఎం యోగిని ప్రశంసిస్తూ, రక్షణ మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని నేను అభినందించాలనుకుంటున్నాను, ఆయన పని విధానం గొప్పగా ఉందని పేర్కొన్నారు.

సమాజ్‌వాదీ పార్టీ వస్తే మాఫియా పెట్రేగిపోతుంది

సమాజ్‌వాదీ పార్టీ వస్తే మాఫియా పెట్రేగిపోతుంది

సమాజ్‌వాదీ పార్టీపై విరుచుకుపడిన రాజ్‌నాథ్ సింగ్.. సమాజ్‌వాదీ పార్టీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. మీరు సమాజ్‌వాదీ పార్టీని బాగా అర్థం చేసుకున్నారని ఓటర్ల నుద్దేశించి పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ వచ్చినప్పుడల్లా అల్లర్లు మొదలవుతాయి. గూండాలు పెరిగిపోతారు. దుర్మార్గాలు పెరుగుతాయి. మాఫియాకి అడ్డాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మారుతుంది. కనుక అటువంటి వారికి యూపీ ప్రజలు పట్టం కట్టబోరని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మాఫియా ద్వారా సంపాదించిన ఆస్తితో తన విలాసవంతమైన ప్యాలెస్‌ను నిర్మించాడని ఆరోపించారు. అన్ని రాజభవనాలు బుల్డోజర్లచే ధ్వంసం చేయబడతాయి అని పేర్కొన్నారు.

 ప్రభుత్వ ఏర్పాటు కోసమే బీజేపీ రాజకీయాలు చెయ్యదు

ప్రభుత్వ ఏర్పాటు కోసమే బీజేపీ రాజకీయాలు చెయ్యదు

ప్రభుత్వ ఏర్పాటు కోసమే భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేయదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశాన్ని నిర్మించేందుకు రాజకీయాలు చేస్తున్నామని, దేశాన్ని అభివృద్ధి చేసేందుకు, అంతర్జాతీయ ప్రపంచంలో మన ఖ్యాతి పెంచేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. భారతదేశం ఇప్పుడు ఒకప్పటి భారతదేశం కాదని ప్రజలు నమ్మడం ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ హయాంలో భారతదేశం ఇప్పుడు శక్తివంతమైన భారతదేశంగా మారిందన్నారు . సర్జికల్ స్ట్రైక్ అవసరమైతే సర్జికల్ స్ట్రైక్ చేశామని, ఎయిర్ స్ట్రైక్ అవసరమైతే ఎయిర్ స్ట్రైక్ చేశామని తెలిపారు. ప్రపంచం మొత్తానికి భారతదేశం గురించి గొప్ప సందేశం ఇచ్చామని వెల్లడించారు.

బీజేపీ హయాంలో దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా పురోగమిస్తుంది

బీజేపీ హయాంలో దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా పురోగమిస్తుంది

2017లో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం రూ.11 లక్షల కోట్లుగా ఉందన్నారు. ఐదేళ్లలో ఈ ఆర్థిక వ్యవస్థ 21 లక్షల కోట్లకు చేరిందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మరో ఐదేళ్ళ పాటు బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఉత్తరప్రదేశ్ ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి జరుగుతోందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సమాజ్‌వాదీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీల ప్రభుత్వం వస్తే అభివృద్ధి రివర్స్‌లో పరుగెత్తడం మొదలవుతుందని ఆయన ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+