Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీ మద్దతు కోరింది అందుకే : కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ సెటైర్లు

సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికి ఉత్తరప్రదేశ్లో పర్యటించడం పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ ప్రజలను అవమానించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతును అఖిలేష్ యాదవ్ ఎందుకు కోరుతున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎస్‌పి అధినేత అఖిలేష్‌ యాదవ్‌పై విరుచుకుపడ్డారు.

Recommended Video

    UP Elections 2022: Akhilesh Yadav కోసం Mamata Banerjee | BJP Manifesto | Oneindia Telugu
    అఖిలేష్ యాదవ్ కు ప్రజా బలం లేదు అందుకే మమత మద్దతు: స్మృతి ఇరానీ

    అఖిలేష్ యాదవ్ కు ప్రజా బలం లేదు అందుకే మమత మద్దతు: స్మృతి ఇరానీ

    గౌతమ్ బుద్ధ్ నగర్‌లోని జేవార్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ అఖిలేష్ యాదవ్ మమతాబెనర్జీని సంప్రదించడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ యాదవ్ తన స్వంత బలంతో ప్రజల మద్దతు సాధించటం లేదని సూచిస్తోందని పేర్కొన్నారు. కాగా, ఎస్పీ తరపున ప్రచారం చేసేందుకు మమత సోమవారం లక్నో చేరుకున్నారు.

    ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్లో స్మృతిఇరానీ మరియు ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ కూడా మధుర మరియు ఆగ్రాలలో బిజెపి అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా సోమవారం ఆగ్రాలో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసి ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.

    మంత్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో స్మృతి ఇరానీ

    మంత్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో స్మృతి ఇరానీ

    స్మృతి ఇరానీ మథురలో మంత్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. 2017 అసెంబ్లీ ఎన్నికలలో ఆగ్రాలో మొత్తం తొమ్మిది స్థానాలు, అలీగఢ్‌లో మొత్తం 7 మరియు మథురలో మిగిలిన నాలుగు స్థానాలు గెలుచుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కోల్పోయిన ఏకైక సీటు అయిన మంత్ సీటును బిజెపి ఎన్నడూ గెలుచుకోలేదు. ఈ క్రమంలోనే ఈసారి ఈ నియోజకవర్గంపై బీజేపీ దృష్టి సారిస్తోంది.

    రాష్ట్రంలో అధికారం మళ్ళీ బీజేపీదే .. వారికి ఓటు వెయ్యొద్దన్న కేంద్ర మంత్రి

    రాష్ట్రంలో అధికారం మళ్ళీ బీజేపీదే .. వారికి ఓటు వెయ్యొద్దన్న కేంద్ర మంత్రి

    ఎస్పీ అభ్యర్థులు అధికారంలోకి రాగానే ‘గుణపాఠం చెబుతామని' బెదిరిస్తున్నారని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఇంకా ఎన్నికలు జరగని తరుణంలో ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వైఖరి ఏమిటో అర్థం చేసుకోవచ్చు అని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లో అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదని హామీ ఇచ్చారు.

    బీజేపీ గెలివ్చి తీరుతుందని స్మృతి ఇరానీ వెల్లడించారు. బీఎస్పీ అభ్యర్థి శ్యామ్ సుందర్ శర్మ ఈ స్థానం నుంచి తన తొమ్మిదో విజయం కోసం పోటీ చేస్తున్నారు, అయితే రాష్ట్రంలో అధికారంలోకి రాని పార్టీకి ఓటు వేయడం వల్ల ప్రయోజనం ఏమిటని స్మృతి ఇరానీ ఓటర్లను ప్రశ్నించారు.

    సమాజ్ వాదీ పార్టీకి ప్రజల మద్దతు లేదన్న స్మృతి ఇరానీ

    సమాజ్ వాదీ పార్టీకి ప్రజల మద్దతు లేదన్న స్మృతి ఇరానీ

    2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో బిజెపిని ఓడించిన టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ, సోమవారం లక్నో చేరుకున్నారు. అమౌసి విమానాశ్రయంలో సురేష్ యాదవ్ మమతా బెనర్జీకి స్వాగతం పలికారు. ఈరోజు ఆమె యూపీలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు . సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలోనే ఉత్తరప్రదేశ్ వాసులకు మద్దతు ఇవ్వమని చెప్పడానికి సమాజ్‌వాదీ పార్టీకి ప్రజలను సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇరానీ పేర్కొన్నారు.

    యూపీని అవమానించిన మమతా బెనర్జీ మద్దతు కోరటంపై అఖిలేష్ పై కేంద్రమంత్రి ఆగ్రహం

    యూపీని అవమానించిన మమతా బెనర్జీ మద్దతు కోరటంపై అఖిలేష్ పై కేంద్రమంత్రి ఆగ్రహం

    ఉత్తరప్రదేశ్ ప్రజల సంప్రదాయాలు, సంస్కృతి మరియు ఆహారపు అలవాట్లను అవమానించినప్పటికీ బెనర్జీ నుండి మద్దతు కోరారని అఖిలేష్ యాదవ్‌పై ఆమె విరుచుకుపడ్డారు. గతాన్ని మరచిపోయి, రాష్ట్ర వాసులను బహిరంగంగా అవమానించిన వారి మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు మీకేం వచ్చింది అని స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య ఏడు దశల్లో జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+