Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూపీ ఆరోవిడత బరిలో 38శాతం సంపన్నులు; మహిళా అభ్యర్థులు ఎక్కువగా ఆపార్టీ నుండే!!

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇంకా రెండు దశల పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. గురువారం నాడు ఆరో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగనుంది. ఇక ఈ సమయంలో ఏడీఆర్ ఎన్నికల బరిలో ఉన్న సంపన్నుల జాబితా వెలువరించింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువ సంఖ్యలో కోటీశ్వరులు 6వ దశలో ఉన్నారు. మొత్తం 38 శాతం కోటీశ్వరుల అభ్యర్థులు ఉన్నారు. 670 మందిలో 253 మంది కోటీశ్వరులే ఉండటం గమనార్హం .

గత మూడు దశల్లో కోటీశ్వరుల సంఖ్య స్థిరంగా ఉంది. నాలుగో విడత ఎన్నికలలో పోటీ చేసిన వారిలో 37 శాతం, ఐదో విడత ఎన్నికలలో పోటీ చేసిన వారిలో 35 శాతం మంది కోటీశ్వరులైన అభ్యర్థులు ఉన్నారు. నివేదిక ప్రకారం, సమాజ్‌వాదీ పార్టీ (SP) 45 మంది, భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థుల్లో 42 మంది, మొత్తం ఈ రెండు పార్టీలలో కలిపి 80 శాతానికి పైగా రూ. 1 కోటి కంటే ఎక్కువ విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు.

UP Elections: 38 per cent of UP candidates are rich candidates; Female candidates are mostly from congress

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 మంది అభ్యర్థులకు రూ.5 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. 100 మంది అభ్యర్థులు రూ.2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. దాదాపు సగం మంది అభ్యర్థులు 670 మందిలో 333 మంది రూ. 50 లక్షల లోపు ఆస్తులు కలిగి ఉన్నారు. బిఎస్‌పికి చెందిన నలుగురిలో దాదాపు ముగ్గురు కోటీశ్వరులు కాగా, సగం మంది కాంగ్రెస్ అభ్యర్థులు అదే వర్గానికి చెందినవారు అని నివేదికలోని డేటా చూపుతోంది.

అసెంబ్లి ఎన్నికలలో 6వ దశ అభ్యర్థుల్లో దాదాపు 10 శాతం (605 మందిలో 65 మంది) మహిళలు ఉన్నారని అభ్యర్థుల అఫిడవిట్‌ల ఏడీఆర్ విశ్లేషణ వెల్లడించింది. ఈ దశ ఎన్నికలలో కాంగ్రెస్ అత్యధికంగా 39 శాతం, అంటే 22 మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు మూడింట ఒకవంతు మహిళలకే టిక్కెట్లు ఇస్తామని పార్టీ ప్రకటించింది.

మిగిలిన ప్రధాన పార్టీలకు అభ్యర్థిత్వంలో 10 శాతం కంటే తక్కువ మహిళా ప్రాతినిధ్యం ఉంది. కాంగ్రెస్, ఎస్పీ 10 శాతం మహిళా అభ్యర్థులను బరిలోకి దించగా, బీఎస్పీ 9 శాతం, బీజేపీ 6 శాతం మహిళలకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు కేటాయించాయి. ఏ డి ఆర్ నివేదికలో అందించిన డేటా ప్రకారం, సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, బిజెపి, మరియు ఆమ్ ఆద్మీ పార్టీలో పోటీ చేసిన మహిళా అభ్యర్థుల సంఖ్య ఈ దశ ఎన్నికలలో కాంగ్రెస్ కంటే తక్కువగా ఉన్నట్లుగా విశ్లేషణ పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+