మోదీకి ఓటమి రుచి చూపిస్తాం, మా సత్తా చూపిస్తాం, వారణాసిలో లెక్కమారింది, మాజీ సీఎం
ప్రధాని నరేంద్ర మోదీ హవాతో లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ ఎంపీ అభ్యర్థులు అనేక ప్రయత్నాలు చేశారు. మోదీ హవాతో కచ్చితంగా ఎంపీలు అవుతామని బీజేపీ అభ్యర్థులు నమ్ముతున్నారు. అయితే వారణాసిలో పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఓటమి రుచి చూపిస్తామని, బీజేపీ అభ్యర్థులు అందరూ కచ్చితంగా ఓడిపోతారని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు.
దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు 400 లోక్ సభ నియోజక వర్గాల్లో బీజేపీని ఇంటికి పంపిస్తారని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో తప్పా మిగిలిన లోక్ సభ నియోజక వర్గాలు అన్నింటిలో బీజేపీ ఓడిపోతుందని, తాము ముందు నుంచి చెబుతున్నామని, అయితే ఇప్పుడు నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసిలో కూడా పరిస్థితులు తారుమారు అవుతున్నాయని మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు.

వారణాసిని జపాన్ తరహాలో అభివృద్ధి చేస్తానని ఇంతకాలం ప్రధాని నరేంద్ర మోదీ గొప్పలు చెప్పుకున్నారని, అయితే వారణాసికి ఆయన చేసింది ఏమీ లేదని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు ఇంతకాలం మోదీ మాటలు విని విసిగిపోయిన వారణాసి ప్రజలు ఇప్పుడు ప్రధానిని కూడా ఓడించడానికి సిద్దంగా ఉన్నారని, జూన్ 4వ తేదీ ఆ విషయం బీజేపీ నాయకులకు కూడా తెలుస్తోందని మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రతి లోక్ సభ నియోజక వర్గంలో బీజేపీ ఓటమి తప్పదని, అందులో ఎలాంటి అనుమానం లేదని మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ వ్యంగంగా అన్నారు. ఉత్తరప్రదేశ్ లో 27 లోక్ సభ నియోజక వర్గాల్లో పోలింగ్ జరగవలసి ఉంది. లోక్ సభ ఎన్నికల తేదీ ప్రకటించక ముందే ఇండియా కూటమిలో భాగం అయిన కాంగ్రెస్, ఎస్పీ ఉత్తరప్రదేశ్ లో సీట్ల పంపకాలు చేసుకున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని 80 లోక్ సభ నియోజక వర్గాలపైకి 63 లోక్ సభ నియోజక వర్గాల్లో సమాజ్ వాదీ పార్టీ, 17 లోక్ సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం మీద ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అడ్రస్ లేకుండా పోతుందని ఆరోపణలు చేసిన మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ను టార్గెట్ చేసుకుని ఎదురుదాడి చెయ్యడానికి ఆ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు సిద్దం అవుతున్నారు.
-
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
హోం శాఖ లాగేసుకున్న బీజేపీ. సీఎం వద్దే 29 శాఖలు -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!











Click it and Unblock the Notifications