పేకాట వ్యసనం.. డబ్బుల్లేక భార్యను.. స్నేహితులతో ఆ పని..!
లక్నో : జూదం .. ఓ వ్యసనం. ఆ అలవాటే కొందరినీ రోడ్డుమీదికి తెస్తుంది. ధర్మరాజు అంతటి వాడే జూదంలో రాజ్యాన్ని కోల్పోయాడు. చివరికి అడవుల పాలయ్యాడు. ఇక కలికాలంలో జూదానికి బానిసలై ఇల్లు, జాగ కోల్పోతున్నారు కొందరు. అయితే ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన జరిగింది. జూదంలో ఓడిపోతే తన భార్యని ఇచ్చేస్తానని పందెం కాశాడో రాయుడు. అతని అతి నమ్మకం వమ్మయిపోయింది. ఇంకేముంది అతని భార్యను అప్పగించాల్సిన పరిస్థితి. ఇదే అదనుగా భావించిన అతని స్నేహితులు ఊరికే వదిలేయకుండా .. లైంగికదాడి చేశారు.

జూదంలో ఓడిపోయి ..
యూపీలోని జౌన్పూరు జిల్లాలోని జఫరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. మద్యంతోపాటు జూదంలో మునిగితేలేవాడు. అతని స్నేహితుడు అరుణ్, బంధువు అనిల్‌తో కలిసి పేటాక ఆడేవాడు. అయితే పేకాటలో ఉన్నదంతా పోవడంతో ఏం చేయాలే తెలియలేదు. సోగ్గాడి పెళ్లాం సినిమాలో హీరో తన వద్ద డబ్బులు అయిపోవడంతో పాపకు తీసుకొచ్చిన పాలను కూడా పెడతాడు. ఈ సీన్ సినిమాలో జూదంతో మనిషి ఎలా మారతాడోనని అద్దం పడుతుంది. జౌన్పూరులో కూడా అలాగే వ్యవహరించాడు. తాను ఓడిపోతే తన భార్యను ఇస్తానని పిచ్చి బెట్టు కాశాడు. కానీ అతడిని విధి వెక్కిరించింది. ఓడిపోవడంతో భార్యను అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. బంధువు అయిన అనిల్ కానీ .. స్నేహితుడు అరుణ్ .. పందెం కాశాడని వదిలేయలేదు. పందెం పందెమే అన్నట్టు అతని భార్యపై లైంగికదాడి చేశారు.

సాముహిక లైంగికదాడి
భర్త రాక్షసుడిలా మారాడు. బెట్టు ఓడిపోయి తన పెళ్లాన్ని వారికి అప్పగించారు. దీంతో వారు ఆమెపై లైంగిక దాడి చేశారు. భర్త తీరు సరిగాలేదని తన మేనమామ ఇంటికెళ్లిపోయింది. అయితే తాను మారానని అక్కడికొచ్చాడు భర్త. ఇంటికి రమ్మని నంగనాచీలా నటించాడు. నిజమేననుకొని నమ్మి భర్తతో వెళ్లింది. అయితే మార్గమధ్యలోనే కారు ఆపి .. తన స్నేహితులను ఎక్కించుకున్నాడు. వారు మరోసారి ఆమెపై లైంగికదాడి చేశారు. నమ్మించి మోసం చేసిన భర్త, లైంగికదాడి చేసిన నిందితులపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే జఫారాబాద్ పోలీసులు కేసు నమోదు చేయలేదు. లాభం లేదనుకొని ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం కలుగజేసుకొని కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

కోర్టు మొట్టికాయలతో ..
జఫారాబాద్ పోలీసులకు కోర్టు మొట్టికాయలు వేయడంతో పోలీసులు స్పందించారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాదు ఎఫ్ఐఆర్ కాపీని కోర్టుకు సమర్పించారు. అయితే తన భర్త, లైంగికదాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతుంది. ఇంట్లో మందు తాగుతూ, పేకాట ఆడే తన భర్త .. తననే ఇస్తానని చెప్పడం, వార్ లైంగికదాడి చేయడం ఏంటని మండిపడింది. వారిపై కఠినచర్యలు తీసుకుంటే మరొకరు ఇలాంటి పిచ్చి పందెలు కాయబోరని పేర్కొన్నది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications