కూతురును భుజాలపై ఎత్తుకుని వెళుతున్న వ్యక్తిపై కాల్పులు (వీడియో)
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మోటారు సైకిల్‌పై వచ్చిన సాయుధ దుండగులు.. తన చిన్న కుమార్తెను భుజాలపై మోస్తున్న వ్యక్తి తలపై తుపాకీతో కాల్చి పరారయ్యారు. గమినంచిన స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతడ్ని తదుపరి చికిత్స కోసం బరేలీకి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
బాధితుడిని 28 ఏళ్ల షోయబ్‌గా గుర్తించారు. తుపాకీతో కాల్చిన ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. షోయబ్ తన కూతురిని భుజంపై వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నట్లు వీడియోలో కనిపించింది. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు అతనిని దాటడం, ఆ వ్యక్తిని చూడడానికి వెనుకకు తిరిగే ముందు ఆపివేయడం కనిపిస్తుంది.

అప్పుడు ఒక సాయుధ దుండగుడు షోయబ్‌ను సమీపించి షోయబ్ తలపై కాల్చడం వీడియోలో కనిపించింది. ఆ తరువాత, దుండగుడు బైక్‌పై వేచి ఉన్న ఇద్దరు వ్యక్తులతో కలిసి అక్కడ్నుంచి పారిపోయారు. తుపాకీతో కాల్చడంతో నేలపై పడిపోయాడు షోయబ్, అతని కుమార్తె కూడా కిందపడిపోయింది. ఘటనను గమనించిన స్థానికులు వారికి సాయం చేసేందుకు పరుగు తీసుకుంటూ వెళ్లారు.
ఆగస్టు 13న రాత్రి 7:30 గంటలకు ఈ ఘటన జరిగిందని షాజహాన్‌పూర్ ఎస్పీ అశోక్ మీనా తెలిపారు. ఘటనకు సంబంధించిన ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితుల గుర్తింపును పరిశీలిస్తున్నామని చెప్పారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఈ దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది.












Click it and Unblock the Notifications