బాలిక శీలానికి వెల.. రూ.50 వేలు, చెప్పు దెబ్బలు అంటూ తీర్పు.. విమర్శలు

లైంగికదాడికి గురైన బాలిక పరిస్థితి దయనీయం.. న్యాయం కోసం గ్రామ పంచాయతీ పెద్దలను ఆశ్రయించడమే పాపమైపోయింది. ఆమెను మరింతగా అవమానపరిచారు. శీలానికి వెల కట్టారు. రూ.50 వేలు తీసుకొని, 5 చెప్పు దెబ్బలు కొట్టి ఊరుకోమని సర్ది చెప్పారు. సదరు బాలిక కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో పంచాయతీ పెద్దల తీర్పు వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్ గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

కోఠిభర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గ్రామానికి చెందిన యువకుడు పొలంలో కూరగాయలు కోస్తున్న 13 ఏళ్ల బాలికపై ఈ నెల 23వ తేదీన అత్యాచారం చేశాడు. తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఇంటికి చేరిన బాలిక ఘటన గురించి కుటుంబసభ్యులకు వివరించింది. దీంతో బాధితురాలి కుటుంబం పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేసింది. అలా చేస్తే వారిని మరింత అవమానానికి గురిచేశారు.

up panchayat tells girl to settle rape case

ఘటనపై పంచాయతీ పెద్దలు విచారించారు. జరిగిన ఘటన నిజమేనని అంగీకరించారు. నిందితుడికి రూ.50 వేలు జరిమానాతోపాటు ఐదు చెప్పు దెబ్బలు శిక్షగా విధించారు. ఈ తీర్పుతో మనస్థాపానికి గురైన ఆ కుటుంబం ఈ నెల 25న పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. తమకు న్యాయం చేయాలని వేడుకుంది. స్పందించిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

తమకు న్యాయం చేయాలని కోరడమే వారి పాపమైపోయింది. శీలానికి వెలకట్టారు పంచాయతీ పెద్దలు. రూ.50 వేలు తీసుకోవాలని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చెప్పు దెబ్బలు కొడితే జరిగిన అనర్థానికి మూల్యం చెల్లించినట్టు అవుతుందా అని నెటిజన్లు అడుగున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+