గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై కేసు... ఆ వెంటనే వెనక్కి తగ్గిన పోలీసులు...
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో పాటు అదే సంస్థకు చెందిన మరో ముగ్గురు ఉన్నతాధికారులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఆ తర్వాత వెనక్కి తగ్గిన పోలీసులు ఎఫ్ఐఆర్ నుంచి వారి పేర్లను తొలగించారు. మొత్తం 17 మందిపై కేసు నమోదు చేయగా... అందులో సుందర్ పిచాయ్ సహా మరో ముగ్గురు గూగుల్ అధికారుల పేర్లను చేర్చారు. కానీ ఈ కేసుతో వీరికి సంబంధం లేదని గుర్తించి పేర్లను తొలగించారు.
వివరాల్లోకి వెళ్తే... ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచేలా ఉన్న వాట్సాప్,యూట్యూబ్‌లలో ఓ వీడియో సర్క్యులేట్ అవుతోందంటూ వారణాసికి చెందిన ఓ వ్యక్తి బెలుపూర్ పోలీసులను ఆశ్రయించాడు. ఆ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు తనకు 8500 బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పాడు. పోలీసులు ఆ వీడియోను పరిశీలించగా అప్పటికే సోషల్ మీడియాలో 5లక్షల మంది దాన్ని వీక్షించారు.

ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 504,506,500,120B కింద కేసు నమోదు చేశారు. ఆశ్చర్యంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేరుతో పాటు భారత్‌కు చెందిన ముగ్గురు గూగుల్ ఉన్నతాధికారుల పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. అయితే యూట్యూబ్‌లో సర్క్యులేట్ అవుతున్న ఆ వీడియోతో వీరికి సంబంధం లేదని గుర్తించడంతో అదే రోజు ఎఫ్ఐఆర్ నుంచి పేర్లను తొలగించినట్లు బెలుపూర్ పోలీస్ అధికారులు వెల్లడించారు. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న మిగతా వ్యక్తులను విచారిస్తున్నట్లు తెలిపారు.
ఘాజీపూర్‌కు చెందిన ఓ మ్యూజిషియన్స్ బృందం పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చినట్లు తెలిపారు. మోదీని కించపరిచేలా ఉన్న ఆ వీడియోను వీరే రూపొందించి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications