వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ దూకుడు.. 30 మంది స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం ప్రధాన రాజకీయ పార్టీల‌న్నీ తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రచార పర్యంలో దూసుకుపోతున్నాయి. గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా కుస్తీ పడుతున్నాయి. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఆయా పార్టీలు తొలి, రెండో దశలో పోటీ చేసే తమ అభ్యర్థులను ప్రకటించాయి. స్టార్ట్ క్యాపెయినర్లను ప్రచారంలోకి దించాయి.

Recommended Video

UP Assembly Elections 2022 : Is Priyanka Gandhi Vadra CM For UP ? | Oneindia Telugu
 కాంగ్రెస్ 30 మంది స్టార్ క్యాంపెనన్లు వీరే..

కాంగ్రెస్ 30 మంది స్టార్ క్యాంపెనన్లు వీరే..

యూపీతో ఒంటరిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకునేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. ఎన్నికల ప్రచారాన్ని 30 మంది స్టార్ క్యాంపెనర్లను రంగంలోకి దింపింది. ఈ మేరకు స్టార్ క్యాంపెనర్ల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. ఈ స్టార్ క్యాంపెనర్ల లిస్టులో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, గులాం నబీ అజాద్, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ , భూపేష్ బాఘేల్ తో పాటు మొత్తం 30 మంది జాబితాను ప్రకటించింది. ఇప్పటికే ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ లో అన్ని తానై కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వీరంతా ఇక నుంచి ప్రచారంలో దిగనున్నారు.

 ప్ర‌చారంలో దూకుడు

ప్ర‌చారంలో దూకుడు


కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఉత్తరప్రదేశ్ తొలి, రెండవ దశ ఎన్నిక‌ల్లో పోటీచేయబోయే అభ్య‌ర్థులను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో తొలి ద‌శ పోలింగ్ జ‌రుగ‌నున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రచారంపై పార్టీ దృష్టి సారించింది. ఈ సారి మెరుగైన స్థానాలలో విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. కాగా, రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిని అశోఖ్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరు అధిష్టానం ప్రకటించిన యూపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు.

70శాతం కొత్త ముఖాలు..


యూపీలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల్లో పాత వారిని పక్కన పెట్టి దాదాపు 70 శాతం కొత్త ముఖాలను ఎన్నికల బరిలోకి దించుకోతంది. మహిళలకు 40 అవకాశం ఇస్తామన్న వాగ్దానానికి కట్టుబడి ఉన్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి పియాంకా గాంధీ స్ఫష్టం చేశారు. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నామ‌న్నారు. ఇప్పటి వరకు ప్రటించిన 166 మంది అభ్యర్థుల్లో 70 శాతం కొత్తవారి పేర్లను ప్రకటించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్ర‌వ‌రి 10 నుంచి మార్చి 7 వ‌ర‌కు జరగనున్నాయి. మొత్తం ఏడు ద‌శ‌ల్లో పోలింగ్ జ‌రుగ‌నుంది. మార్చి 10న ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్నారు

English summary
Congress released list of 30 star campaigners In Uttar pradesh Assembly Election 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X