54 సీట్లలో 613 మంది అభ్యర్థులు.. మరికొన్ని గంటల్లో యూపీ చివరి విడత పోలింగ్

ఉత్తరప్రదేశ్ ఏడో.. చివర విడత పోలింగ్ మరికొన్ని గంటల్లో జరగనుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. 9 జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. 613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Recommended Video

    UP Elections 2022 Phase 7 Updates చివరి విడత పోలింగ్ ఉత్కంఠ | Exit Poll | Oneindia Telugu

    54 నియోజకవర్గాలు ఉండగా.. 11 ఎస్సీలు, రెండు ఎస్టీలకు కేటాయించారు. 2017లో వీటిలో 29 చోట్ల బీజేపీ గెలిచింది. మిత్రపక్షం ఆప్పా దళ్, ఎస్బీఎస్పీ కూడా అందులో ఉన్నాయి. ఎస్పీ 11, బీఎస్పీ 6 సీట్లు గెలుచుకుంది. అలాగే ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసికి పోలింగ్ జరగనుంది. ఇదీ బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. యూపీలో గెలిస్తే.. దేశంలో ఆ పార్టీ గెలుస్తోందని నానుడి ఉన్న సంగతి తెలిసిందే.

     UP polls Phase 7: Over 2 crore voters to decide fate of 613 candidates in 54 seats

    ఇదివరకు కాంగ్రెస్ పార్టీతోపాటు సమాజ్ వాదీ పార్టీపై ప్రధాని మోడీ ఫైరయ్యారు. 2014 నుంచి 2017 వరకు ఇక్కడ కుటుంబ పాలన ఉందన్నారు. తాను కూడా హెల్ప్ చేయలేని పరిస్థితి అని చెప్పారు. ఆ సమయంలో యూపీ నుంచి తాను ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించానని గుర్తుచేశారు. కానీ ఏం ప్రయోజనం లేదని.. కుటుంబపాలన తనను అడ్డుకుందని వివరించారు. తమకు మరోసారి పట్టం కడితే సుపరిపాలన అందజేస్తామని చెప్పారు.

    ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉండేదని మోడీ గుర్తుచేశారు. చిరు వ్యాపారులు బిజినెస్ చేయడానికి భయపడేవారని చెప్పారు. దొంగతనాలు, రోడ్లపైనే దోపిడీలు జరిగేవని చెప్పారు. ఓడిపోయిన వారు తమ విద్వేషం వ్యాపించజేశారని ఆరోపించారు. కులం పేరు విద్వేష రాజకీయాలు చేశారని వివరించారు. యూపీ అభివృద్ది.. దేశాభివృద్ది అని మోడీ అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+