యూపీలో అత్యాచారాలు 50శాతం, నేరాలు 70శాతం తగ్గాయి: 300 సీట్లంటూ అమిత్ షా
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో ఐదో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న క్రమంలో బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతాప్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసారి ఎన్నికల్లోనూ బీజేపీకి 300కుపై గా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

యూపీలో నేరాలు 70 శాతం తగ్గాయి, మాఫియాకు ముగింపు పలికాం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని అమిత్ షా అన్నారు. గత ఐదేళ్లలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు సగానికిపైగా తగ్గిపోయాయని తెలిపారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ ముగింపు పలికారన్నారు. నేరాల సంఖ్య భారీగా తగ్గిందని అమిత్ షా తెలిపారు. డెకాయిటీ 72 శాతం తగ్గింది, దోపిడీలు 62 శాతం, హత్యలు 31 శాతం, కిడ్నాప్‌లు 29 శాతం, రేప్ కేసులు 50 శాతం తగ్గాయి. దీన్ని బీజేపీ ప్రభుత్వం చేసిందని అమిత్ షా అన్నారు. క్రిమినల్ ఎలిమెంట్స్ పెంపకానికి గత ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాలే కారణమని, నేరగాళ్లు కటకటాల వెనక్కి వెళ్లాలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు అమిత్ షా.

బీజేపీకి ఓటేస్తే నేరగాళ్లంతా జైల్లోనే...: అమిత్ షా
ఈ SP-BSP, BSP-SP, 'బువా, భతిజా' ప్రభుత్వాలు రాష్ట్రాన్ని బలవంతులు, మాఫియా నియంత్రణలోకి నెట్టాయి. బీజేపీ ప్రభుత్వం కేవలం ఐదేళ్లలో మాఫియా రాజ్యాన్ని విముక్తి చేసిందని, మాయావతిని 'బువా' అని, అఖిలేష్ యాదవ్‌ను 'భటీజా' అని అమిత్ షా పేర్కొన్నారు. అతీక్ అహ్మద్ (SP), ముఖ్తార్ అన్సారీ (BSP), ఆజం ఖాన్ (SP) వంటి రాజకీయ నాయకులను జైలులో పెట్టడాన్ని గత ప్రభుత్వాలు మాఫియాకు ప్రోత్సహిస్తున్నాయనడానికి సూచికగా పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మిమ్మల్ని వేధించడానికి మళ్లీ బయటకు వస్తారు. బీజేపీని గెలిపించండి, మిగిలిన నేరస్థులు కూడా కటకటాల వెనక్కి వెళ్తారని ఓటర్లను అమిత్ షా కోరారు. మాఫియా ఆక్రమించిన రూ.2000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను బీజేపీ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని, ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతకు అనుగుణంగా పేదలకు ఇళ్లు కట్టించిందన్నారు అమిత్ షా.
Recommended Video

ఉచిత స్కూటీలు, ల్యాప్‌టాప్/ట్యాబ్ లెట్లు: అమిత్ షా
కరోనా మహమ్మారి సమయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు రెండేళ్ల పాటు ఉచిత రేషన్ అందించిందని, ఆదిత్యనాథ్ వారికి పప్పు, నూనె, ఉప్పును అందించడం ద్వారా ప్రయత్నాన్ని బలపరిచారని అమిత్ షా పేర్కొన్నారు.
వ్యవసాయ వర్గాల కోసం, యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందని, ఏ రైతు కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. భాజపా ప్రభుత్వం బాలికలకు ఉచిత స్కూటీ, యువతకు ల్యాప్‌టాప్/టాబ్లెట్‌లు అందజేసి వారి చదువుకు తోడ్పడుతుందని అమిత్ షా చెప్పారు. ప్రతాప్‌గఢ్‌లో ఫిబ్రవరి 27న ఐదో దశ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఎన్నిలక ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications