భారత్ పటాన్ని తప్పుగా చిత్రీకరిస్తే రూ.100 కోట్ల జరిమానా, జైలు
న్యూఢిల్లీ: భారత దేశ చిత్రపటాన్ని తప్పుగా చిత్రీకరిస్తే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.100 కోట్ల జరిమానా విధించనున్నారు. భావ స్వేచ్ఛ పేరుతో అత్యుత్సాహం కొద్దీ మన దేశ పటాన్ని సామాజిక మాధ్యమాల్లో, మరెక్కడైనాగానీ తప్పుగా చిత్రీకరించినా, ప్రచురించినా జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడనుంది.
ది జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్ బిల్లు-2016 డ్రాప్ట్‌ను కేంద్రం సిద్ధం చేసింది. సామాజిక మాధ్యమాల్లో జమ్మూ కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో, అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో భాగంగా ఉన్నట్లుగా పటాలు ప్రదర్శితమవుతుండటంతో వీటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఈ కఠిన చర్యకు ఉపక్రమించింది.

ఇంటర్నెంట్ వేదికలు, ఆన్‌లైన్ సర్వీసులతోపాటు మరెక్కడైనాగానీ ఎవరైనా భారత భౌగోళిక పటానికి సంబంధించి అంతర్జాతీయ సరిహద్దులు సహా తప్పుడు, అబద్ధాలతో కూడిన అంశాలను చిత్రీకరించినా, ప్రదర్శించినా, ప్రచురించినా, పంపిణీ చేసినట్లు కనుగొన్నా చట్ట ప్రకారం రూ.కోటి నుంచి రూ100 కోట్ల వరకు జరిమానా, ఏడేళ్ల జైలు శిక్షకు గురవుతారని డ్రాప్ట్‌లో పేర్కొన్నారు.
సాక్షాత్తు ట్విటర్ సైట్ ఇటీవల కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ రహితంగా భారత భౌగోళిక పటాన్ని ప్రదర్శించింది. దీనిపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో దానిని సరి చేసింది. వరుస సంఘటన నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది.












Click it and Unblock the Notifications