వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపి ఎన్నికలు: ఎస్పీకి సవాల్, ఎలా...

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో సంకీర్ణ రాజకీయాలు నేటి వాస్తవిక పరిస్థితులకు ప్రతిబింబం. కానీ అధికార పార్టీగా ప్రజాతీర్పును అనుకూలంగా పొందడం సమాజ్‌వాదీ పార్టీకి అతిపెద్ద సవాల్ వంటిదే. గతంలో వేర్వేరు పార్టీలతో కూటమి రాజకీయాల్లో తీపి, చేదు గుర్తుల అనుభవాలు కల ఈ రెండు పార్టీల మధ్య మెరుగైన పొత్తుగా మిగిలే అవకాశాలు ఉన్నాయా? లేదా? అన్నది ఫలితాల తర్వాత గానీ తేలదు.

కాంగ్రెస్ పార్టీని నిలువరించేందుకు మూడు కూటములు

కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య రాజకీయాలకు చెక్ పెట్టేందుకు 1967లో భారతీయ క్రాంతిదళ్ పేరిట, 1977లో జనతా పార్టీగా, 1989లో జనతాదళ్ పార్టీగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సాగాయి. తర్వాత 1993లో బీఎస్పీ - ఎస్పీ, 1996లో బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రయోగాత్మక కూటములు ఆవిర్భవించాయి.

బీఎస్పీ, ఎస్పీలు యూపీలో ప్రధాన శక్తులు

నేడు రాజకీయ పార్టీల ఆకాంక్షలు విభిన్నం. సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్న ప్రధాన ప్రాంతీయ పార్టీలు. తమ ఆధిపత్యాన్ని యధాతథంగా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న ఈ రెండు పార్టీల మధ్య దశాబ్దాల తరబడి దేశాన్నేలిన కాంగ్రెస్ పార్టీ యూపీలో తన పట్టు మరింత దిగజారకుండా చూడడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది.

UP’s own grand alliance: Hype amidst challenges

1993, 1996లలో విఫల కూటములు

ఇంతకుముందు బిజెపిని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపిని అధికారానికి దూరంగా పెట్టేందుకు ఎన్నికల తర్వాత ఏర్పాటైన రాజకీయ కూటములు, సంకీర్ణ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఉమ్మడి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో 425 స్థానాల అసెంబ్లీలో 1993లో బీఎస్పీ - ఎస్పీ కూటమి 176 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నది. కాంగ్రెస్ పార్టీ బయటి మద్దతుతో ఏర్పాటైన ప్రభుత్వం రెండేళ్లలో కుప్పకూలింది. 546 రోజులకే పతనమైంది.

1996లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు: బీజేపీతో బీఎస్పీ సర్కార్

1996లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బిఎస్పీ కూటమి సుమారు 100 స్థానాలు గెలుచుకున్నది. కూటమిలో పెద్ద భాగస్వామ్య పక్షంగా ఉన్న బీఎస్పీ తర్వాత ఎన్నికల ముందు ఏర్పాటైన కూటమికి తిలోదకాలిచ్చి.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. నాటి నుంచి బీఎస్పీ పొత్తు రాజకీయాలను దూరంచేస్తూ వచ్చింది. దళితుల ఓట్లు మినహా ఇతర సామాజిక వర్గాల ఓట్లేవీ బదిలీ కావడం లేదని బీఎస్పీ వర్గాలు తెలిపాయి.

లోహియా సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం

తిరిగి రెండు దశాబ్దాల తర్వాత మరో కూటమి ఆవిర్భవించింది. అదీ కాంగ్రెస్, ఎస్పీ మధ్య ఏర్పాటు కావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక సిద్ధాంతాలు గల రాం మనోహర్ లోహియా ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటైన ఎస్పీతో కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు ముందుకు సాగడం అంత తేలికేం కాదు. దీనికి రెండు పార్టీల మధ్య నెలకొన్న పరస్పర విశ్వాస లోపమే దీనికి కారణం.

యువ నాయకత్వం ముందు ఆశల హరివిల్లు

రెండు పార్టీలకు సారథ్యం వహిస్తున్న యువ నాయకత్వం ముందు విజయావకాశాలు ముందు కనిపిస్తున్నందు వల్లే సమస్యను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి. తొలుత బిజెపి వ్యతిరేక ఓటు చీలకుండా చూడటం. ముస్లింల ఓట్లను మరింత సంఘటిత పర్చడం. ఎస్పీ ప్రత్యర్థి బీఎస్పీని బలహీన పర్చడంతోపాటు కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయ అవకాశాలు.. ఈ రెండు పార్టీల కలయికకు కారణమైంది. అయితే ఈ పార్టీల ముందు పలు ప్రధాన సవాళ్లు కూడా ఉన్నాయి.

విజయంపై ఆశలతోనే ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు

ఎన్నికల సమరంలో విజయం సాధించాలన్న అవగాహనతోనే రెండు పార్టీలు జట్టుగా ప్రయాణం ప్రారంభించాయి. అయితే క్షేత్రస్థాయిలో రెండు పార్టీల శ్రేణుల మధ్య సమన్వయంతోనే కూటమి విజయం సాధించడం ఆధార పడి ఉంది. ఇప్పటివరకు పరస్పరం వ్యతిరేక రాజకీయాలు చేసిన రెండు పార్టీల కార్యకర్తలు విభేదాలు విస్మరించి సహకార గేయం పాడితేనే సత్ఫలితాలనిస్తుంది.

1992 తర్వాత కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు దూరం

రెండు పార్టీలకు గల ఓటు బ్యాంకులు కూడా ఒక సమస్యే. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత ముస్లింలంతా కాంగ్రెస్ పార్టీ కాడి బడేశారు. అప్పటివరకు వ్యతిరేక భావం కలిగి ఉన్న యాదవ్‌ల పట్ల సానుకూల వైఖరి ఏర్పరుచుకున్నారు. యాదవ్‌లు ఏనాడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకలేదు.

ఎస్పీకి ప్రయోజనం శూన్యమే

2012 ఎన్నికల పలితాల ప్రకారం పరస్పరం విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. రెండు పార్టీలకు పోలైన ఓట్లు 40 శాతం ఉంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకే లబ్ది చేకూరుతుందే గానీ ఎస్పీకి ఒనగూడే ప్రయోజనం శూన్యమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకుముందు ముందస్తు పొత్తులతో లబ్ది పొందిన అజిత్ సింగ్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ (ఆర్ఎల్డీ) ఈ దఫా కూటమిలో భాగస్వామి కాదు.

బీహార్ తరహాలోనే సంయుక్త ప్రచారం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే రెండు పార్టీలు కలిసి ఎన్నికల ప్రచారం చేయడం ద్వారా విజయం సాధించేందుకు ప్రణాళికలు రూపొందించాయి. 1990 నాటితో పోలిస్తే ఈ రెండు పార్టీలకు బిజెపి ముప్పుగా పరిణమించడమే కారణంగా తెలుస్తున్నది.

English summary
Uttar Pradesh assembly elections will be a challenge for ruling Samajwadi Oarty (SP).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X