అయ్యో పాపం: చికిత్స పొందుతున్న ఎస్పీ సురేంద్ర కుమార్ దాస్ మృతి

ఆత్మహత్యాయత్నం చేసి గత కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈస్ట్ కాన్పూర్ ఎస్పీ సురేంద్ర దాస్ కుమార్ మృతి చెందారు. 2014 బ్యాచ్‌కు చెందిన 30 ఏళ్ల సురేంద్రకుమార్ దాస్...గతనెలలోనే ఈస్ట్ కాన్పూర్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టాడు. సెప్టెంబర్ 5వ తేదీన ఉదయం తన భార్య రవీనా సింగ్ సురేంద్ర దాస్ కుమార్‌ అచేతన స్థితిలో పడిఉండటం గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించింది. ఆ తర్వాత మరో ప్రైవేట్ ఆస్పత్రికి అక్కడి నుంచి రీజెన్సీ హాస్పిటల్‌కు సురేంద్ర కుమార్‌ను తరలించారు. ఇక అప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉంది.

ఆత్మహత్య చేసుకునేందుకు సురేష్ కుమార్ ఎలుకల మందు తాగి ఉంటాడని అదే తన శరీరాన్నంత విషమయం చేసిందని వైద్యులు తెలిపారు. సురేంద్ర కుమార్‌కు కొన్ని ఆపరేషన్లు చేయాల్సి వచ్చిందని... శనివారం అతని కొన్ని శరీర అవయవాల్లోకి రక్త ప్రసరణ నిలిచిపోయిందని వైద్యులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12.19 గంటలకు సురేంద్ర దాస్ తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. తన తల్లి ఇందు దేవి, సోదరుడు నరేంద్ర దాస్ సమక్షంలో బుధవారం సురేంద్ర దాస్ గదిలో సోదాలు నిర్వహించిన ఫోరెన్సిక్ టీమ్‌కు ఒక సూసైడ్ నోట్ దొరికింది. అయితే తన మృతికి ఎవరూ కారణం కాదని సురేంద్ర దాస్ అందులో పేర్కొన్నారు. అంతేకాదు తన వైవాహిక జీవితం గురించి అందులో వివరించారు. త్వరలోనే కేసును విచారణచేసి అన్ని విషయాలు తెలియజేస్తామని కాన్పూర్ జోన్ ఏడీజీ అవినాష్ చంద్ర తెలిపారు.

UP SP Surendra Kumar Das dies after battling for life for four days

యువ ఐపీఎస్ ఆఫీసర్ అర్థాంతరంగా జీవితాన్ని ముగించేయడం చాలా బాధవేసిందన్నారు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్. సురేంద్ర దాస్ కుమార్ చాలా కష్టపడే వ్యక్తి అని డీజీపీ ఓపీ సింగ్ కొనియాడారు. అంతకుముందు శనివారం ఎస్పీ దాస్ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు డీజీపీ కాన్పూర్ ఆస్పత్రికి వెళ్లారు. సురేంద్ర దాస్ కుమార్ ఆదివారం మృతి చెందడంతో ఆయన మృతిని జీర్ణించుకోలేకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+