అపహరించి రేప్ చేసి మహిళను చంపి రోడ్డుపై పడేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను అపహరించి, ఆమెపై రేప్ చేసి, ఆమెను హత్య చేసి శవాన్ని రోడ్డుపై పడేశారు. ఈ దురాగతానికి పాల్పడినవారి కోసం పోలీసులు రాంపూర్ పోలీసులు సోమవారం నుంచి గాలిస్తున్నారు.
మహిళ శవం జాతీయ రహదారి సమీపంలో కనిపించిందని గ్రామస్తులు చెప్పారు. గాయాలైన నగ్నంగా ఉన్న గుర్తు తెలియని శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పరిసరాల్లోని పోలీసు స్టేషన్లలో కనుక్కున్నారు. అయితే, మిస్సింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులేమీ లేవు.

మహిళపై అత్యాచారం చేసి ఆమెను చంపారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ తేజ్‌వీర్ సింగ్ చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించారు. మహిళను గుర్తించడానికి ప్రయత్నిస్తామని సింగ్ చెప్పారు.
వేరే చోట మహిళపై అత్యాచారం చేసి, ఆమెను చంపి అయోమయానికి గురి చేయడానికి శవాన్ని రోడ్డు పక్కన పడేసి ఉంటారని ఆయన అన్నారు. హంతకులను పట్టుకోవడానికి పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications