యూపీఎస్సీ రిక్రూట్‌మెంట్: 398 ఉద్యోగాలకు అప్లై చేయండి
హైదరాబాద్: యూపీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 398 కంబైన్డ్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్(అసిస్టెంట్ కమాండెంట్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు ఏప్రిల్ 25, 2018 నుంచి మే 21, 2018లోపు దరఖాస్తు చేసుకోవాలి.
కమిషన్ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: కంబైన్డ్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్(అసిస్టెంట్ కమాండెంట్) పరీక్ష-2018
ఖాళీల సంఖ్య: 398
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: మే 21, 2018
జీతం వివరాలు: పేర్కొనబడలేదు

విద్యార్హత: రాష్ట్ర లేదా కేంద్రం చట్టం చేత లేదా యూజీసీ నిబంధనల ప్రకారం ఏర్పడిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతను కలిగి ఉండాలి.
వయో పరిమితి: 01.08.2018 నాటికి అభ్యర్థుల వయస్సు 20-25ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
- రాత పరీక్ష
- దేహ దారుఢ్య పరీక్ష
- ఇంటర్వ్యూ/వ్యక్తిగత పరీక్ష
ఫీజు వివరాలు: ఏదైనా ఎస్బీఐ శాఖలో నగదు డిపాజిట్ చేయవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా వీసా/మాస్టర్/రూపే/క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు.
ఎస్సీ/ఎస్టీ/మహిళలు: ఫీజు మినహాయింపు
ఇతరులు: రూ.200
ముఖ్యమైన తేదీలు:
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 21.05.2018
రిజిస్ట్రేషన్ చివరి తేదీ:21.06.2018
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!