వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేపల వేట: పల్లెటూరు పట్నంగా మారింది

హకార రంగ వ్యవస్థ రంగ ప్రవేశం చేసిన తర్వాత గ్రామస్తులంతా చేపల వేట, విక్రయాల బాట పట్టిన తర్వాత క్రమంగా ఆ గ్రామం రూపురేఖలే మారిపోయాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ముంబై: అది వాయవ్య ముంబై కోస్తా తీరానికి చేరువలో ఉన్న ఒక కుగ్రామం అది. దాని పేరు వెర్సోవా. వెర్సోవా గ్రామస్థులు ఒకనాడు తమ కుటుంబ జీవనం కోసం సంప్రదాయ వృత్తులపై జీవనం సాగించారు. ఈ గ్రామంలో నివసిస్తున్న వారంతా వెనుకబడిన సామాజిక వర్గం కోలీలు. ఈ గ్రామంలోకి సహకార రంగ వ్యవస్థ రంగ ప్రవేశం చేసిన తర్వాత గ్రామస్తులంతా చేపల వేట, విక్రయాల బాట పట్టిన తర్వాత క్రమంగా ఆ గ్రామం రూపురేఖలే మారిపోయాయి.
అప్పటి వరకు మామూలు పల్లెటూరుగా ఉన్న వెర్సొవా క్రమంగా పట్టణం రూపు సంతరించుకోవడమే కాదు. పూర్వపు ఆనవాళ్లే కనిపించవు. ఊరంతా బహుళ అంతస్థుల భవనాలే కనిపిస్తాయి. పూర్తిగా అధునాతన రూపు సంతరించుకున్న ఇళ్లు.. రంగురంగుల మార్బుల్స్.. రకరకాల డిజైన్లతో నిర్మించుకున్నారు.

15 ఏండ్ల క్రితం సహకార సంఘాల పర్యవేక్షణలో గ్రామస్తులు చేపల వ్యాపారం.. వాటిని నిల్వ చేసుకునేందుకు ఏకంగా ఒక ఐస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుకున్నారు. ఈ గ్రామంలోని నాలుగువేల కుటుంబాలు తమ జీవనానికి చేపల వ్యాపారం, ఐస్ ఫ్యాక్టరీ నిర్వహణే మార్గమైంది.

చేపల రవాణాకు ట్రాలీలు.. నిల్వకు అవసరమైన ఐస్

అరేబియా సముద్రంలో పట్టే చేపల రవాణా కోసం కొందరికి ట్రాలీలు ఏర్పాటుచేసిన సహకార సంఘాలు వీటిని నడిపేందుకు డీజిల్, చేపలను నిల్వచేసేందుకు అవసరమైన ఐస్ కూడా పంపిణీచేస్తూ వచ్చాయి. ప్రస్తుతం వెర్సోవా గ్రామంలో 300పైగా ట్రాలీ డ్రైవర్లు నిత్యం సముద్ర తీరానికి, గ్రామానికి మధ్య చేపలు రవాణా చేస్తున్నాయి. రోజూ సగటున 25 - 30 ట్రాలీలు సముద్ర తీరం నుంచి తాజా చేపలను మార్కెట్ తీసుకొస్తాయి. ఒక్కో ట్రాలీలో సుమారు రూ.3 లక్షల విలువ గల చేపలను రవాణా చేయొచ్చని ట్రాలీ డ్రైవర్లు చెప్పారు. ప్రతి ట్రాలీ డ్రైవర్ నెలకు మూడుసార్లు ట్రిప్పులు వేస్తారు.

ఎనిమిది వేల మందికి లభిస్తున్న ఉపాధి

చేపల విక్రయంపై రమారమీ 3000 మంది, అనుబంధ వ్యాపారాలపై మరో 5000 మంది ఉపాధి పొందుతున్నారు. గ్రామంలోని 80 శాతం పురుషులు చేపలవేటకు వెళ్తే.. వాటి విక్రయం బాధ్యత ఆయా కుటుంబాల మహిళలది. మధ్యాహ్నం తీరం నుంచి చేపలు వచ్చేసమయానికి ఆయా కుటుంబాల మహిళలు మార్కెట్‌కు చేరుకుంటారు. తమ వద్దకు వచ్చే వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా చేపలు విక్రయిస్తుంటారు. సూర్యాస్తమయం వరకు ఈ వ్యాపారం సాగుతుంది. వారు హోల్‌సేల్, రిటైల్ వ్యాపారంతోపాటు విదేశాలకు ఎగుమతి లావాదేవీల్లో నిష్ణాతులయ్యారు. విదేశీ వ్యాపారులతో ఎగుమతి లావాదేవీల నిర్వహణలో ఆరితేరారు.

Urban village Versova turns fishing into Rs 400 crore business

వార్షిక టర్నోవర్ రూ.400 కోట్లు

ఒక్కో కుటుంబానికి ఏడు ట్రాలీలు ఉన్నాయి. ఆ ట్రాలీల్లో తీసుకొచ్చిన చేపలు, రొయ్యల విక్రయంలో సదరు ట్రాలీ కుటుంబాల మహిళలు నిమగ్నమవుతారు. విక్రయ ప్రస్తుతం చేపల వ్యాపారం టర్నోవర్ సుమారు రూ.400 కోట్లు ఉంటుందని కోలీ మహా సంఘ్ ప్రధాన కార్యదర్శి రాజ్‌హన్స్ తప్కే చెప్పారు. సహకార వ్యవస్థకు తాము రుణ పడి ఉంటామని తమ జీవితాల్లో పూర్తిగా మార్పులు తీసుకొచ్చిందన్నారు. గ్రామంలోని నాలుగు సహకార సంఘాల్లో వెసవా మచ్ఛిమార్ వివిధ్కార్యాకారీ సహకార సంఘం అతి పెద్దది. దీని పరిధిలో 4000 మంది సభ్యులు ఉండగా, 271 ట్రాలీలు పనిచేస్తున్నాయి.

25 ఏళ్ల క్రితం అరేబియా సముద్ర తీర ప్రాంత గ్రామాలు, పట్టణాల వాసులు తమ ఇళ్లలో వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదిలేయడంతో పూర్తిగా కలుషితమైన నీటిలో రెండు దశాబ్దాల క్రితం చేపల వేట మానేశారు. మలాద్, గోరెగావ్, కొవ్టే, ఎరాంగల్, అంబోలీ, ఒషివారా ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటి శుద్ధికి ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడం వల్ల సముద్రంలో 50 నాటికల్ మైళ్ల వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగలుగుతున్నారని ప్రదీప్ తాప్కే తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒకటి, రెండు బోట్లు కూడా కలిగి ఉన్నారు.

తొలుత సొసైటీల ఆధ్వర్యంలోనే చేపలు, రొయ్యల విక్రయం

15 ఏళ్ల క్రితం చేపలు, రొయ్యల విక్రయం బాధ్యత అంతా సొసైటీలే నిర్వహించాయి. ప్రస్తుతం ట్రాలీ యజమానులే స్వయంగా అమ్మకాలు సాగించే స్థాయికి చేరుకున్నారు. అనారోగ్యకరమైన పోటీ నివారణకు నిర్ణీత ధర కంటే తక్కువకు చేపలు విక్రయించకుండా నిరంతరం పర్యవేక్షిస్తామని ఓ సహకార సంఘం డైరెక్టర్ జితేంద్ర చించాయ్ అన్నారు. క్రమంగా వృథా తగ్గించేందుకు దెబ్బతిన్న చేపలను ఎండబెట్టి.. ఫౌల్ట్రీ ఫామ్‌ల్లో కోళ్లకు ఆహారంగా విక్రయిస్తున్నారు.

ఇతర మార్గాల్లో ఆదాయం సంపాదనకు 2005 నుంచి ప్రతిఏటా మూడు రోజుల వెర్సోవా ఫిష్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించిన ఫిష్ ఫెస్టివల్‌లో ఏర్పాటైన 60 స్టాళ్లలో ఒక్కొక్కటి సుమారు రూ.5 -6 లక్షలు సంపాదించాయి. మూడు రోజుల్లోనే మొత్తం బిజినెస్ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని అంచనా. అధికారులు అవకాశం కల్పిస్తే బీచ్ వెంబడి శాశ్వత ప్రాతిపదికన స్టాళ్ల ఏర్పాటుతో తమకు వెసులుబాటుగా ఉంటుందని వారు చెప్తున్నారు.

English summary
MUMBAI: A typical working day starts at 2pm for Sandhya Bhanje. She arrives at the jetty to oversee the unloading of the catch and stays on to supervise sales to customers from all over the city until sunset.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X