వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజన్ వారసుడిగా ఉర్జిత్‌ పటేల్‌: ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌కు‌ ప్రమోషన్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మరికొన్ని వారాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌గా రఘరాం రాజన్ పదవీ కాలం ముగియనుండటంతో ఆర్‌బీఐకి కొత్త గవర్నర్‌గా ఉర్జిత్‌‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రఘురాం రాజన్ విధానాలను ముందుకు తీసుకెళ్లాల్సి ఉన్నందున కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న ఉర్జిత్ పటేల్‌కు గవర్నర్‌గా కేంద్రం‌ ప్రమోషన్ ఇచ్చింది ఆయనను ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్‌ 4తో ప్రస్తుత గవర్నర్‌ రఘురాం రాజన్‌ పదవీకాలం ముగియనున్న సంగతి తెలిసిందే.

Urjit Patel

దీంతో సెప్టెంబర్ 4న ఆయన ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో గత కొంతకాలంగా రఘరాం రాజన్ వారసుడు ఎవరన్న అంశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

ఉర్జిత్ పటేల్‌ విషయానికి వస్తే...

* 1963 అక్టోబరు 28న జన్మించారు.
* లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకానమిక్స్‌లో బీఏ అభ్యసించారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి 1986లో ఎంఫిల్‌ పట్టా పొందారు.
* 1990లో యేల్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో పీహెచ్ డీ పూర్తి చేశారు.
* 1990 నుంచి 1995 మధ్య కాలంలో అంతర్జాతీయ ద్రవ్యనిధిలో యుఎస్, ఇండియా, బహమ్మాస్, మయన్మార్ డెస్క్‌లకు సంబంధించిన విధులు నిర్వహించారు.
* 2000-2004 మధ్య పలు కమిటీలకు పలు ఆర్థిక కమిటీలకు నేతృత్వం వహించారు.
* 2013లో రిజర్వ్‌బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌గా నియామకం.
* ఆర్థిక సలహాదారుగా, బ్యాంకర్‌గా పలు కీలకస్థానాల్లో విధులు నిర్వహించారు.
* బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లో అడ్వైజర్ గా విధులు నిర్వహించారు.
* బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్ లో నాన్ రెసిడెంట్ సీనియర్ ఫెల్లోగా ఉన్నారు.
* రిలయన్స్ ఇండస్ట్రీస్ కు సంబంధించిన పలు బిజినెస్ డెవలప్ మెంట్స్‌లో పాలుపంచుకున్నారు
* గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పోరేషన్ బోర్డు మెంబర్‌గా కూడా పనిచేశారు.

English summary
Deputy Governor of the RBI Urjit Patel has been appointed as the 24th Governor of the Reserve Bank of India. Patel, who was in-charge of RBI's monetary policy, will replace Raghuram Rajan, who vacates office on September 4.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X