వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగీళా బ్యూటీ పొలిటికల్ ఎంట్రీ.. ఈ పార్టీ తరపున ఇక్కడి నుంచే పోటీ..?

|
Google Oneindia TeluguNews

ముంబై:కాంగ్రెస్ నుంచి మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతోందా..? ఒకప్పుడు కుర్రకారు మనసులను దోచేసిన ఈ భామ ఇప్పుడు ప్రజాసేవ చేస్తానంటూ అక్కడి ప్రజల మనసులను దోచేందుకు సిద్ధమయ్యిందా..? ఇంతకీ కాంగ్రెస్ వర్గాలు ఏంచెబుతున్నాయి... ఎవరా డ్రీమ్ హీరోయిన్... ఎక్కడి నుంచి పోటీచేసే అవకాశం ఉంది..?

కుర్రకారును ఉర్రూతలూగించిన బ్యూటీ

కుర్రకారును ఉర్రూతలూగించిన బ్యూటీ

ఊర్మిళా మటోండ్కర్.. ఒకప్పుడు కుర్రకారును తన అందంతో అభినయంతో కట్టిపడేసిన అందాల భామ. ఈమెపేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది రామ్‌గోపాల్ వర్మ సినిమా రంగీలా. ఈ చిత్రంలో తన అందచందాలను ఆరబోసి యువతకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఒకప్పుడు వెండితెరపై సత్తా చాటిన ఈ రంగీళా భామ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో కూడా అదే సత్తాను చాటేందుకు సిద్ధమైపోతోంది. ఊర్మిళా కాంగ్రెస్ పార్టీ తరపున ముంబై లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయనున్నట్లు తెలుస్తోంది.

ఉత్తర ముంబై లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి ఊర్మిళా..?

ఉత్తర ముంబై లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి ఊర్మిళా..?

1983లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీరంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ముంబై ఉత్తరం లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే విషయమై ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపంతో పాటు ఊర్మిళా కుటుంబ సభ్యులను సంప్రదించగా వారు మాత్రం కామెంట్ చేసేందకు నిరాకరించారు. అయితే ఊర్మిళా పేరు ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తర్వలోనే ఆమె పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు ముంబై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రాహుల్ ప్రకటించిన ఆ పథకం సాధ్యం కాదు....అది ఎన్నికల స్టంట్ మాత్రమే: జైట్లీరాహుల్ ప్రకటించిన ఆ పథకం సాధ్యం కాదు....అది ఎన్నికల స్టంట్ మాత్రమే: జైట్లీ

ముంబై ఉత్తరం నుంచి గెలుపొందిన ప్రముఖలు

ముంబై ఉత్తరం నుంచి గెలుపొందిన ప్రముఖలు

ఒకవేళ ముంబై ఉత్తరం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఊర్మిళా బరిలోకి దిగితే ఆమె ప్రత్యర్థిగా బీజేపీ నేత ఎంపీ గోపాల్ షెట్టీ ఉంటారు. అయితే ముంబై ఉత్తరం బీజేపీకి కంచుకోటగా ఉంటోంది.ఇక ఒక్కసారి ఈ నియోజకవర్గం గురించి లెక్కలు తీస్తే 2004లో బాలీవుడ్ నటుడు గోవిందా ఇక్కడి నుంచి పోటీ చేసి కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ రాంనాయక్‌పై ఘన విజయం సాధించారు. ఇక 2009లో రాంనాయక్ మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి నిరుపంపై ఓటమి చవిచూశారు. ఇక 2014 ఎన్నికల్లో మోడీ మానియా ఉండగా నిరుపంపై బీజేపీ అభ్యర్థి గోపాల్ షెట్టి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ముందునుంచి పాపులర్ వ్యక్తులు ఎంపీగా విజయం సాధిస్తూ వచ్చారు. సునీల్ దత్ ఈ స్థానం నుంచి ఐధు సార్లు విజయం సాధించారు.

English summary
Political circles are abuzz with speculation over famed Bollywood actress Urmila Matondkar's possible entry into politics as a Congress candidate in Mumbai, sources said on Monday.The ''Masoom'' (1983) child actress is widely considered in the reckoning for a Congress nomination from Mumbai North Lok Sabha constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X