వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త: సైనె‌క్రోన్‌లో కొత్తగా 1500 మందికి ఉద్యోగాలు

ఓ వైపు ఆటోమేషన్, మరోవైపు విదేశీ మార్కెట్లలో రక్షణాత్మక విధానాలు దేశీయ టెక్కీల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నాయి. ఈ తరుణంలో అమెరికాకు చెందిన ఓ ఐటీ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

పూణే: ఓ వైపు ఆటోమేషన్, మరోవైపు విదేశీ మార్కెట్లలో రక్షణాత్మక విధానాలు దేశీయ టెక్కీల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నాయి. ఈ తరుణంలో అమెరికాకు చెందిన ఓ ఐటీ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది.సైనెక్రోన్ అనే సంస్థ 1500 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు ప్రకటించింది.

సైనెక్రోన్ అనే మధ్య స్థాయి ఐటీ కంపెనీ వచ్చే 12 మాసాల్లో 1500 మందికి ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్టు ప్రకటించింది. తన రెవిన్యూలను కూడ 2020 రెండింతలు చేసుకోవాలని టార్గెట్ విధించుకొంది.

US-based IT co Synechron to hire around 1500 in a year in Pune

తమ సంస్థలో ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది.ప్రస్తుతం ఈ కంపెనీలో 7500 మంది ఉద్యోగులున్నారు. రానున్న ఏడాదిలో 1500చ మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాలని ఆ కంపెనీ నిర్ణయం తీసుకొంది.

ఇండియాలోని హైద్రాబాద్, బెంగుళూరు, పూణెల్లో ఈ నియామకాలను చేయనున్నట్టు ఆ సంస్థ సిఈఓ ఫైసల్ హుస్సేన్ ప్రకటించారు.తద్వారా ఇండియాలోని మూడు కార్యాలయాల్లో ఆ సంస్థ తన ఉద్యోగులను 5వేల మందికి పెంచుకోవాలని భావిస్తోంది.

2017 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెవిన్యూలు 390 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇవి 2018 నాటికి 480 మిలియన్ డాలర్లకు పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకొంది.

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో అందిస్తున్న సేవలతో 25 శాతం కంటే ఎక్కువగా తమ రెవిన్యూ వృద్దిని నమోదు చేయగలమని హుస్సేన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

English summary
As it targets to more than double its revenues to USD 1 billion by FY20, mid-tier IT firm Synechron today said it is looking to hire up to 1,500 in the next 12 months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X