వీసాలపై గుడ్ న్యూస్ చెప్పిన భారత్ లోని అమెరికా ఏంబసీ
భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం శుభవార్త వినిపించింది. చెన్నైలోని అమెరికా కాన్సులేట్ జనరల్ వీసా దరఖాస్తు ప్రక్రియ సేవలను పునరుద్ధరించినట్లు ప్రకటించింది. నేటి నుండి ఈ సేవలు అందుబాటులో వచ్చాయి. అపాయింట్‌మెంట్లు ఉన్న దరఖాస్తుదారులు మాత్రమే నేడు కాన్సులేట్‌కు రావాలని సూచించింది.
ఇటీవలే వీసా సర్వీసులను అమెరికన్ ఎంబసీ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా రద్దైన అపాయింట్‌మెంట్లను తిరిగిపునరుద్ధరించినట్లు కాన్సులేట్ పేర్కొంది. దరఖాస్తుదారులకు కొత్త తేదీ, సమయం గురించి టెక్స్ట్ మెసేజ్ అందుతుందని తెలిపింది. దీని ద్వారా ప్రతి దరఖాస్తుదారుడు కూడా రీషెడ్యూల్ అయిన ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ వివరాలతో కూడిన అదనపు సమాచారాన్ని పొందుతారని వెల్లడించింది.

వ్యక్తిగత అపాయింట్‌మెంట్లు లేదా ఇతర మార్గదర్శకాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వీసా అప్లికేషన్ సెంటర్ (VAC)ని సంప్రదించాలని కాన్సులేట్ సూచించింది. ఇందుకోసం [email protected]కు ఇమెయిల్ చేయవచ్చు.ఈ ఉదయం నుండే అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ కార్యకలాపాలు కూడా యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. నిధుల కొరత కారణంగా అమెరికన్ సెంటర్ చెన్నై, ఎడ్యుకేషన్ యూఎస్ఏ, యూఎస్ఐఈఎఫ్ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండవని తెలియజేసింది.
జూన్ 23న అమెరికా వీసా స్క్రీనింగ్ విధానాలను బలోపేతం చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ సేవల పునరుద్ధరణ చోటు చేసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం- ఎఫ్, ఎం, లేదా జె నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్‌లను పబ్లిక్‌గా మార్చాల్సి ఉంటుంది. ఇది వారి ఐడెంటిటీ, అమెరికాలో ప్రవేశానికి వారి అర్హతను నిర్ధారించడానికి అవసరమైన స్క్రీనింగ్ ను మరింత సులభతరం చేస్తుంది.
ప్రతి వీసా మంజూరు కూడా జాతీయ భద్రతకు అనుగుణంగా ఉంటుందని రాయబార కార్యాలయం తెలిపింది. దానికి లోబడి తమ నిర్ణయాలు ఉంటాయని వివరించింది. 2019 నుండి.. అమెరికా వీసా దరఖాస్తుదారులను ఇమ్మిగ్రెంట్, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తు ఫామ్‌లల్లో సోషల్ మీడియా ఐడెంటిఫైయర్‌లను అందించాలని కోరినట్లు గుర్తు చేసింది. తమ దేశ జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారిని గుర్తించడానికి, అనర్హులు వీసా దరఖాస్తులను తిరస్కరించడానికి ఇది ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించింది.
U.S. Consulate General Chennai will re-open and restart visa application processing services on THURSDAY, OCTOBER 23, 2025.
— U.S. Consulate General Chennai (@USAndChennai) October 22, 2025
Please Note: ONLY applicants with appointments scheduled for OCTOBER 23 may come in on that date. Applicants whose appointments were canceled due to visa… pic.twitter.com/o44eHTt9hO
అదే సమయంలో- కొత్త ట్రావెల్ బ్యాన్ ను కూడా ప్రకటించింది. ఇందులో 12 దేశాల పౌరులపై పూర్తి నిషేధాన్ని విధించిన విషయాన్ని పొందుపరిచింది. మరో ఏడు దేశాల వీసా యాక్సెస్‌పై పాక్షిక పరిమితులు విధించినట్లు తెలిపింది. జాతీయ భద్రతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వీటిల్లో ఎక్కువ భాగం మిడిల్- ఈస్ట్, ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయి.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications