భారత్ కు అమెరికా భారీ గుడ్ న్యూస్.. రూ. 11 లక్షల కోట్లు రీఫండ్..!!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) లో భాగంగా సంచలన నిర్ణయాలు తీసుకొచ్చారు. వలసవాదులను తిరిగి స్వదేశాలకు పంపించారు. అలాగే వీసాల జారీలో కఠినమైన రూల్స్ ను ప్రవేశపెట్టారు. ఇక ప్రపంచ దేశాలపై సుంకాల మోత మోగించారు. ప్రపంచ దేశాలతోపాటు భారత్ పైనా అమెరికా గతంలో అనేకసార్లు సుంకాలు విధించింది. భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా ఇలా సుంకాలు విధించింది అమెరికా.

రష్యా నుంచి చమురు కొనుగోలు కారణంగా అప్పటికే ఉన్న 25 శాతం టారిఫ్ లకు మరో 25 శాతం అధనంగా టారిఫ్ లు విధిస్తూ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత వాటిని 18 శాతానికి తగ్గించారు. ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే భారత్ వస్తువులపై అమెరికాలో కేవలం 10 శాతం మాత్రమే టారిఫ్ లు విధిస్తున్నారు. అంటే పాకిస్థాన్, చైనా వస్తువుల కంటే భారత్ ఉత్పత్తులే అమెరికాలో తక్కువ ధరకు లభ్యం అవుతున్నాయి.

ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న అనేక సంచలనాత్మక నిర్ణయాలను అక్కడి సుప్రీంకోర్టు ఖండిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయినా కూడా ట్రంప్ అదే దుందుడుకు వ్యవహారాన్ని ఆవలంభించేవారు. అయితే గతంలో భారత్ తో పాటు వివిధ దేశాలపై ట్రంప్ సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఆ టారిఫ్ లు చెల్లవని ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. దాంతో భారత ఎగుమతిదారులకు భారీ ఊరటను ఇస్తూ 166 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 11.20 లక్షల కోట్లు టారిఫ్ లు రీఫండ్ చేసేందుకు అమెరికా సిద్దమైంది. ఈ మేరకు రీఫండ్ విండోను ప్రారంభించింది. ఏప్రిల్ 20 నుంచి యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అనే డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా ఈ దరఖాస్తులను స్వీకరించనున్నారు.

US Opens 11 2 Lakh Crore Tariff Refund Window A Massive Financial Boost for Indian Exporters 2026

ఏప్రిల్ 2, 2025 నుంచి అగ్రరాజ్యంలో అమల్లోకి వచ్చిన ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్(IEEPA) కింద విధించిన సుంకాలను అమెరికాలోని సుప్రీంకోర్టు కొట్టివేసింది. సరైన చట్టబద్ధత లేకుండా ఈ సుంకాలను విధించారని.. అందువల్ల ఆ టారిఫ్ లను తిరిగి చెల్లించాల్సిన బాధ్యత అమెరికా ప్రభుత్వంపై ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇక మొత్తం రీఫండ్ లో భారత్ నుంచి ఎగుమతి అయిన ఉత్పత్తుల వాటా దాదాపు 10 నుంచి 12 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.. తాజా నిర్ణయంతో టెక్స్ టైల్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, రసాయన ఎగుమతులకు ప్రయోజనం కలగనుంది. ఇక భారతీయ ఎగుమతిదారులు తమ అమెరికన్ క్లయింట్స్ తో చర్చలు జరిపి తమ వాటాను పొందొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+