జో బిడెన్‌తో దేశీ కనెక్షన్: ముంబై, చెన్నైతో లింక్: ఇంటిపేరుతో మిస్టరీ లెటర్
ముంబై: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్‌కు అందిన ఓ పాత లెటర్.. వార్తల్లోకెక్కింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి వెళ్లిన లెటర్ అది. బిడెన్ ఫ్రమ్ ముంబై పేరుతో అమెరికాకు వెళింది. జో బిడెన్ చేతికి చేరింది. 1972 నాటి ఆ ఉత్తరం ప్రస్తుతం మిస్టరీగా మారింది. బిడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి 48 సంవత్సరాల కిందటే రాసిన లేఖను ఎవరు పంపించి ఉంటారనే అంశం వెనుక ఆసక్తికరమైన ఉదంతం ఉంది.
Recommended Video

లెస్లీ డంకన్ బిడెన్ పేరుతో..
ఆ ఉత్తరాన్ని రాసింది లెస్లీ డంకన్ బిడెన్. జో బిడెన్ కుటుంబానికి దూరపు బంధువు. చాలాకాలం పాటు ముంబైలో నివసించిన ఆయన 1982లో మరణించారు. తాను చనిపోవడానికి పది సంవత్సరాల ముందే- జో బిడన్‌కు ఉత్తరాన్ని రాశారు. ఆయనను అభినందించారు. ప్రత్యేకంగా జో బిడెన్‌ను అభినందిస్తూ.. అదే పనిగా ఉత్తరాన్ని రాయడానికి కారణం లేకపోలేదు. ఆ ఏడాది జో బిడెన్ సెనెటర్‌గా ఎన్నికయ్యారు. అప్పటికి ఆయన వయస్సు 29 సంవత్సరాలు.

అభినందిస్తూ ముంబై నుంచి లెటర్..
అత్యంత చిన్న వయస్సులోనే సెనెట్‌కు ఎన్నికైన నాయకుడిగా జో బిడెన్ రికార్డు సాధించారు. ఆ సందర్భంగా లెస్లీ బిడెన్.. జో ను అభినందిస్తూ ఈ లెటర్ రాశారు. ఎన్వలప్ కవర్‌లో దాన్ని పోస్ట్ చేశారు. ఆ కవర్‌పై బోంబే జనరల్ పోస్ట్ ఆఫీస్ అనే స్టాంప్ ఉంది. లెస్లీ బిడెన్ కుటుంబం తొలుత నాగ్‌పూర్‌లో, అనంతరం ముంబైలో నివసించింది. ఆయనొక్కరే కాదు. క్రిస్టొఫర్ బిడెన్, ఆయన సోదరుడు విలియం బిడెన్ భారత్‌లో స్థిరపడ్డ వారే. వారిద్దరూ ఈస్టిండియా కంపెనీలో కేప్టెన్లుగా పనిచేశారు.

ఈస్టిండియా కంపెనీలో
క్రిస్టొఫర్ బిడెన్ సుదీర్ఘకాలం పాటు అప్పటి మద్రాస్ స్టేట్‌లో నివసించారు. అనంతరం ముంబైకి తరలివెళ్లారు. ఈస్టిండియా కంపెనీలో షిప్ కేప్టెన్‌గా పనిచేస్తోన్న సమయంలో మద్రాస్ నుంచి ముంబై తరచూ రాకపోకలు సాగించేవారు. ఇప్పటికీ చెన్నైలో కేప్టెన్ క్రిస్టొఫర్ బిడెన్ పేరు మీద శిలాఫలకం ఉంది. ఈ బిడెన్ బ్రదర్స్ ఇద్దరూ జో కుటుంబానికి దూరపు బంధువులు. ఈ విషయాన్ని జో బిడెన్ స్వయంగా వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో 2013లో ఆయన ముంబైని సందర్శించిన సమయంలో తన పూర్వీకుల వివరాల గురించి తెలిపారు.

పూర్వీకులుగా పేర్కొన్న జో..
లెస్టీ బిడెన్ రాసిన ఉత్తరం గురించి వివరించారు. క్రిస్టొఫర్ బిడెన్, ఆయన సోదరుడు విలియం బిడెన్ తన పూర్వీకులుగా పేర్కొన్నారు. ముంబైతో తనకు కుటుంబ సంబంధాలు ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 2015లో వాషింగ్టన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలోనూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. భారత్‌లో మొత్తం అయిదుమంది బిడెన్లు నివసిస్తున్నారని వివరించారు. ఈ రకంగా చూస్తే.. అమెరికా కొత్త ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కే కాదు.. జో బిడెన్‌కు కూడా తమిళనాడు, భారత్‌తో సంబంధాలు ఉన్నట్టే.












Click it and Unblock the Notifications