పాకిస్తాన్ కు అమెరికా ఫోన్.. అసలేం జరుగుతుంది?

భారత్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు కారణంగా మారింది. భారత్ పాక్ ల మధ్య చోటు చేసుకున్న యుద్ధం రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. అయితే చాలా దేశాలు ఇరు దేశాలు చర్చలు జరపాలని, యుద్ధాన్ని ఆపాలని పలు సందేశాలను ఇస్తున్నాయి. పహల్గాం దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా సాగుతుంది. పాకిస్తాన్ ను భారత్ సేనలు వణికిస్తున్నాయి.

భారత్ పాక్ యుద్ధం.. అమెరికా వైఖరి
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా ఇవాళ కౌంటర్ ఆపరేషన్ బున్యన్ ఉల్ మర్సూస్ ను చేపట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన పరిస్థితుల నేపధ్యంలో పలువురు ఈ యుద్ధం వద్దని జోక్యం చేసుకోవటానికి, చర్చలకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం కోసం అంతర్జాతీయంగా పలుదేశాలు ముందుకొస్తున్నాయి. వీటిలో ఇరాన్, చైనా ఉండగా, యుద్ధం వద్దని చర్చలు జరపాలని అమెరికా సైతం కోరుతుంది.

US Secretary of State calls Pakistan Army Chief this is what happens in india pak war 2025

Take a Poll

పాక్ ఆర్మీచీఫ్‌కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్
ఈ క్రమంలో పాక్ ఆర్మీచీఫ్‌కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్ చేశారు. పాక్ ఆర్మీచీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌తో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఆయన సూచించారు. ఇరు దేశాల మధ్య చర్చల అవసరం ఉందని మార్కో రూబియో పేర్కొన్నారు.

భారత్ పాక్ యుద్ధంలో జోక్యం చేసుకోమన్న జేడీ వ్యాన్స్.. శాంతి కాంక్ష
ఇక ఇటీవల భారత్ పాక్ మధ్య యుద్ధంలో తాము జోక్యం చేసుకోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తేల్చి చెప్పారు. రెండు అణు శక్తి దేశాలు ఘర్షణ పడుతూ భారీ సంక్షోభం వైపు రావడం పైన తాము ఆందోళన చెందుతున్నమని ఆయన పేర్కొన్నారు. వీలైనంత తొందరగా పరిస్థితులు శాంతి దిశగా కోరుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరోమారు అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి చర్చల అవసరం ఉందని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు తేల్చి చెప్పారు.

భారత్ పాక్ ఉద్రిక్తతలతో విమానాశ్రయాల తాత్కాలిక మూసివేత
ఇదిలా ఉంటే భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ లో ఈ నెల 14 వరకు ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ప్రకటించింది. ఢిల్లి విమానాశ్రయంలో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు సామాజిక మాధ్యమంలో వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+