యూఎస్ వీసా ఉంటే చాలు.. ఈ దేశాలకు వీసా లేకుండా వెళ్ళొచ్చు!
యూఎస్ వీసా పొందడం చాలా కష్టమైన పనిగా భావిస్తూ ఉంటారు. ఇది చాలా ఇబ్బందికరమైన పని అయినప్పటికీ ఒక్కసారి యూఎస్ వీసా స్టాంపింగ్ పాస్పోర్ట్ లో జరిగితే అది మీకు అనేక దేశాలకు వీసా లేకుండానే అద్భుతమైన అనేక దేశాలకు ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. యూఎస్ వీసా భారతీయ పాస్పోర్టుల ప్రపంచ చలనశీలత ను బాగా పెంచుతుంది. అమెరికన్ సరిహద్దు దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తుంది.
యూఎస్ వీసాతో అనేక దేశాలకు వీసా లేకుండానే ప్రయాణం
చెల్లుబాటు అయ్యే యూఎస్ వీసాతో వీసా లేకుండానే అనేక దేశాలకు పర్యటించవచ్చు. దాదాపు 20కి పైగా దేశాలు యూఎస్ వీసా ఉంటే పర్యాటకులను తమ దేశంలోకి వీసా లేకుండానే అనుమతిస్తాయి. ఈ సౌకర్యం యూరోపియన్ దేశాలు, దక్షిణ అమెరికా, కరేబియన్ దీవులు, ఆసియాలోని కొన్ని దేశాలలో లభిస్తుంది. ఇది ప్రయాణాలను మరింత సులభతరం చేస్తుంది.

యూఎస్ వీసా ఉంటే ఈ దేశాలకు వీసా లేకుండానే రాజమార్గం
చెల్లుబాటు అయ్యే ఇతర దేశాలలోకి ప్రవేశాన్ని ఈజీ చేసే యూఎస్ వీసా కలిగి ఉన్న భారతీయ పౌరులు ఈ దేశాలకు ఈజీగా వీసా లేకుండానే ట్రావెల్ చేయొచ్చు. చెల్లుబాటు అయ్యే యూఎస్ వీసాతో వీసా లేకుండానే అల్బేనియా దేశంలోకి ప్రవేశించవచ్చు. అక్కడ 90 రోజుల వరకు పర్యటించవచ్చు. అర్జెంటీనా.. us ట్రావెల్ వీసాతో అర్జెంటీనా దేశంలో 90 రోజులపాటు పర్యటించవచ్చు. ఇక్కడ కూడా వీసా తీసుకోవలసిన అవసరం లేదు.
ఈ దేశాల్లో యూఎస్ వీసా ఉన్నవారికి స్వాగతం
బహమాస్.. యూఎస్ వీసా ఉన్నవారికి వీసా లేకుండా అనే బహమాస్ స్వాగతం పలుకుతుంది. ఈ దేశంలో 90 రోజులపాటు వీసా లేకుండా ఉండవచ్చు. యూఎస్ వీసాతో చిలీ దేశానికి కూడా ప్రయాణం చేయవచ్చు. అక్కడ వీసా అవసరం లేకుండానే 90 రోజుల వరకు అవకాశం ఉంది. వీసా లేకుండా చెల్లుబాటు అయ్యే యూఎస్ వీసాతో మెక్సికోలో 180 రోజుల వరకు పర్యటించవచ్చు. వీసా లేకుండా యూఎస్ వీసాతో పనామాలో పర్యటించవచ్చు.
ఈ దేశాల్లోనూ తిరగాలంటే యూఎస్ వీసా ఉంటే చాలు
వీసా లేకుండా యూఎస్ వీసాతో పెరు దేశంలో పర్యటించవచ్చు. ఇక్కడ 180 రోజుల వరకు పర్యటించే వీలుంటుంది. వీసా లేకుండా 30 రోజుల వరకు వసతి మరియు రిటర్న్ టికెట్ రుజువు తో ఫిలిప్పీన్స్ లో పర్యటించవచ్చు. బెలిజ్, కొలంబియా, డొమినికన్ రిపబ్లిక్ , జార్జియా గ్వాటెమాల, మౌంటెనెగ్రో, నార్త్ మాసిడోనియా, సెర్బియా మరియు సింగపూర్ వంటి కొన్ని దేశాలు యూఎస్ వీసాతో ప్రయాణించడానికి వీలు కల్పిస్తాయి.
వీసా లేకుండా ట్రావెల్ చేసే దేశాలలో తెలుసుకోవాల్సినవి ఇవే
యూఎస్ వీసా కలిగి ఉండడం వల్ల కెనడా వంటి దేశాలకు కూడా తాత్కాలిక నివాస వీసా మినహాయింపు ద్వారా ప్రయాణం చేయవచ్చు. ఇక వీసా రహిత ప్రయాణం చేసే దేశాలలో ఉండే నిబంధనలను కూడా తెలుసుకుంటే, దానినిబట్టి ఈజీగా ట్రావెల్ చేసే అవకాశం లభిస్తుంది. యుఎస్ వీసా కలిగి ఉన్న భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు వీసా ఆన్ అరైవల్ పొంది మరికొన్ని దేశాలలో పర్యటించవచ్చు.
వీసా ఆన్ అరైవల్ మీద యీ దేశాలకు వెళ్ళొచ్చు
వీసా ఆన్ అరైవల్ మీద 120 రోజుల వరకు అర్మేనియా లో పర్యటించవచ్చు. వీసా ఆన్ అరైవల్ మీద వీసా రకాన్ని బట్టి 14 రోజుల నుండి 30 రోజుల వరకు బహరేన్ లో పర్యటించవచ్చు. వీసా ఆన్ అరైవల్ మీద 30 రోజుల వరకు ఒమెన్ లో పర్యటించవచ్చు. వీసా ఆన్ అరైవల్ టూరిజం మీద వసతి మరియు నిధుల రుజువు తో 30 రోజుల వరకు సౌదీ అరేబియాలో పర్యటించవచ్చు. ఏది ఏమైనా యూఎస్ వీసా చాలా విలువైనది. అందుకే యూఎస్ వీసా స్టాంపింగ్ కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు.












Click it and Unblock the Notifications