వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను వాడొచ్చా? వాడకూడ‌దా?

ఫేస్ బుక్, వాట్సాప్ లలో అకౌంట్లు కలిగిన వారు తరచూ వారి ప్రొఫైల్ పిక్ మార్చుతూ ఉంటారు. ఇది ఆయా అకౌంట్ హోల్డ‌ర్ల హక్కు. కానీ రెండు మూడు రోజులుగా సోష‌ల్ మీడియాలో ఓ వార్త తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఫేస్ బుక్, వాట్సాప్ లలో అకౌంట్లు కలిగిన వారు తరచూ వారి ప్రొఫైల్ పిక్ మార్చుతూ ఉంటారు. ఇది ఆయా అకౌంట్ హోల్డ‌ర్ల హక్కు. కానీ రెండు మూడు రోజులుగా సోష‌ల్ మీడియాలో ఓ వార్త తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

అదేమిటంటే... జాతీయ జెండాను ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోకూడ‌ద‌ని. అలా పెట్టుకుంటే చ‌ట్ట వ్య‌తిరేక‌మని కొందరు పేర్కొంటున్నారు. ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్, 1971 ప్రకారం... ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం... శిక్షార్హ‌మ‌ని చెబుతున్నారు. ఇంతకీ వీరు చెప్పేది నిజమా? ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా??

పెట్టువడం తప్పా? కాదా?

పెట్టువడం తప్పా? కాదా?

ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను పెట్టుకుంటే తప్పేమిటనేది పలువురు నెటిజ‌న్ల వాద‌న‌. దీనిపై క్లారిటీ లేక జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్న ‘వామ్మో.. ఎందుకొచ్చిన గొడవ.. తీసేస్తే పోలా..' అనుకుని వెంట‌నే వారి ప్రొఫైల్ పిక్ ను మార్చేసుకున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమ అకౌంట్ ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను ఇవ్వాళో.. రేపో పెట్టుకుందామ‌నుకున్న‌వాళ్లు కూడా త‌మ దేశ‌భ‌క్తిని చంపేసుకుందామ‌నుకుంటున్నారు. ఇంతకీ ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గా మన జాతీయ జండాను పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా? ఇది తెలుసుకోవాలంటే పైన పేర్కొన్న యాక్ట్ లను బాగా లోతుకెళ్లి పరిశీలించాల్సిందే!

ఇలా చేస్తేనే నేరం...

ఇలా చేస్తేనే నేరం...

ముందుగా... ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్, 1971 .. దీనిపై ఓ లుక్కేద్దాం. ఈ యాక్ట్ ప్ర‌కారం... దేశ జాతీయ జెండా, జాతీయ చిహ్నం, జాతీయ గీతాల‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా కాని.. మ‌రే విధంగా కాని.. అవమానించిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తే అప్పుడు ఈ చ‌ట్టం ప్ర‌కారం శిక్షార్హం.

ఇంకా.. జాతీయ జెండాను పబ్లిక్ ప్లేస్ లో తగులబెట్డడం, నిర్దేశిత స‌మ‌యంలో కాకుండా వేరే స‌మ‌యంలో ఎగ‌రేయ‌డం, అవ‌న‌తం చేయ‌డం, నాశ‌నం చేయ‌డం, చింపేయ‌డం, జెండాను అమ‌ర్యాద గా చూడటం, వస్త్రాలుగా కుట్టించుకోవ‌డం, లో దుస్తులుగా వాడ‌టం, ద‌స్తీగా వాడ‌టం, నాప్కిన్, కుష‌న్స్ గా వాడ‌టం, జాతీయ జెండాను నేలకు తాకించ‌డం, కావాల‌ని నీళ్ల‌లో త‌డ‌ప‌డం, జాతీయ జెండాను వెహికిల్, ట్రెయిన్, బ‌స్సు, బోటుకు లాంటి వాటి చుట్టూ అలంక‌రించ‌డం, జెండాను బిల్డింగ్ చుట్టూ క‌ట్ట‌డం లాంటివి చేస్తే మూడేళ్ల వ‌ర‌కు శిక్ష విధించడం లేదా మ‌రియు ఫైన్ విధించ‌డం జ‌రుగుతుంది. ఇవి ఆ చ‌ట్టంలో ఉన్న అంశాలు. అయితే.. 1971 లో ఫేస్ బుక్ లేదు కాబ‌ట్టి ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ కు సంబంధించి ఎటువంటి స‌మాచారం ఆ యాక్ట్ లో ఉండ‌దు.

సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే...

సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే...

అయితే 2001లో దీనిపై ఓ పారిశ్రామికవేత్త సుప్రీం కోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వాజ్యం దాఖలు చేశాడు. జాతీయ జెండాను అవ‌మానించ‌కుండా, అగౌర‌వ ప‌ర‌చ‌కుండా ఎగరేస్తే త‌ప్పేంట‌ని సుప్రీంకోర్టు కు అప్పీల్ చేసుకోగా... 1971 చ‌ట్టాన్ని ప‌రిశీలించిన కోర్టు ఆయ‌న వాద‌న‌ను స‌మ‌ర్థించి 1971 చ‌ట్టంలో కొన్ని మార్పులు చేయాల‌ని అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించింది. అలా.. 2001లో కొన్ని స‌వ‌ర‌ణ‌లు చేసిన కేంద్ర ప్ర‌భుత్వం జాతీయ జెండా గౌర‌వాన్ని త‌గ్గించ‌కుండా ప‌బ్లిక్ ప్లేసుల్లో ఎగ‌రేసుకోవ‌చ్చంటూ సవరణ చేసింది. ఆ త‌ర్వాత ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (సవరణ) యాక్ట్, 2005ను ప్ర‌వేశ పెట్టి ఆ చ‌ట్టానికి కొన్ని స‌వ‌ర‌ణ‌లు చేసింది. ఈ సమయంలో కూడా సోష‌ల్ మీడియాలో జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకునే విషయమై ప్రత్యేకంగా ఎటువంటి వివ‌ర‌ణ‌లు ప్రభుత్వం ఇవ్వ‌లేదు.

ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా.. ఏం చెబుతోందంటే..

ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా.. ఏం చెబుతోందంటే..

ఇక‌.. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002 లోనూ.. జాతీయ జెండాను ఎటువంటి వ‌స్త్రం ఉప‌యోగించి త‌యారు చేయాలి, జెండా పొడ‌వు, వెడ‌ల్పు ఎంత ఉండాలి, ఎటువంటి రంగులు ఉపయోగించాలి.. ఇలాంటివే అందులో ఉన్నాయి త‌ప్పితే ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గురించి ఎటువంటి స‌మాచారం లేదు.

నిస్సంకోచంగా వాడుకోవ‌చ్చు, కానీ..

నిస్సంకోచంగా వాడుకోవ‌చ్చు, కానీ..

కాబట్టి, ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను నిస్సంకోచంగా వాడుకోవ‌చ్చు. కానీ.. రివ‌ర్స్ గా జెండాను పెట్టుకోవ‌డం, జెండా రంగులు మార్చ‌డం, జెండాను ఎడిట్ చేయ‌డం, జెండా ను వంక‌ర‌గా పెట్టుకోవ‌డం లాంటివి చేయరాదు. జాతీయ జెండాను ఉన్నది ఉన్నట్లుగా ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గా పెట్టుకుంటే ఎటువంటి స‌మ‌స్యా ఉండ‌దు. జాతీయ జెండా గౌర‌వాన్ని పెంచే ఏ ప‌న‌యినా చేసే హ‌క్కు స‌గ‌టు భార‌త పౌరుడికి ఉంటుంది.

ఒక్క ఫేస్ బుక్ లోనే కాదు...

ఒక్క ఫేస్ బుక్ లోనే కాదు...

ఇంకో విష‌యం ఏమిటంటే... ఒక్క ఫేస్ బుక్ మాత్ర‌మే కాదు... సోష‌ల్ మీడియా నెట్ వ‌ర్క్స్ ట్విట్ట‌ర్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, గూగుల్ ప్ల‌స్ లాంటి వాటిలోనూ జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్ గా ఏమాత్రం సందేహం లేకుండా వాడుకోవ‌చ్చు. కానీ పైన చెప్పుకున్నాం కదా.. కండీష‌న్స్ అప్లై.

English summary
As Independence Day, the 15th of August, is nearing, more and more people are changing their WhatsApp, Facebook and other social media profiles’ display picture. Instead of using their whacky selfies, stunning pics and celebrities’ photos, folks are using the Indian tri color flag as their display picture! This show of patriotism is not set to last long, with many folks expected to change their profile pics as soon as the Independence Day is over. Today, I got a message, one written in a serious tone, urging Indians to stop using tri color flag as their WhatsApp/Facebook or any other social media profile picture. Now, I don’t know whether such messages carry valid and true information or not. The message claimed that the Indian National flag is not supposed to be used this way. Using it this way meant abusing and disrespecting it!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X