ఎస్పీపై మోడీ విసుర్లు-యూపీ అభివృద్ధికి ఫేక్ సమాజ్ వాదీలే అడ్డంకి అన్న ప్రధాని
రాష్ట్రంలో ఐదేళ్లుగా అధికారంలో ఉన్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ గా అభివర్ణించిన ప్రధాని మోడీ.. అభివృద్ధి నదికి అడ్డంకులు కల్పించడానికి నకిలీ సమాజ్ వాదీలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. యూపీలో తమకు భారీ ఆకాంక్షలు ఉన్నాయని, భారత్ స్వాతంత్రానికి వందేళ్లు పూర్తి చేసుకునే సరికి యూపీ అభివృద్ధిలో రోల్ మోడల్ గా నిలుస్తుందని మోడీ తెలిపారు. యూపీలో అభివృద్ధి నదిలో నీరు నిలిచిపోయిందని, ఇది నకిలీ 'సమాజ్‌వాదీ'లు, వారి సన్నిహితుల వల్ల స్తబ్దుగా ఉందని ప్రధాని పేర్కొన్నారు.. ఈ వ్యక్తులకు సామాన్యుల అభివృద్ధి దాహం, ప్రగతి దాహం, పేదరికం నుంచి స్వాతంత్ర్య దాహంతో ఎప్పుడూ సంబంధం లేదని మోడీ విమర్శించారు. ఎస్పీ, బీఎస్పీ పార్టీలు తమ దాహార్తిని, వారి సన్నిహితుల దాహాన్ని తీర్చుకుంటూనే ఉన్నాయని ప్రధాని అన్నారు.
గతంలో మహిళలపై వేధింపులు చాలా సాధారణంగా ఉండేవని, పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని, చైన్ స్నాచింగ్ సంఘటనల తర్వాత, ప్రజలు ఇప్పటికీ జీవించి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని ప్రధాని తెలిపారు. సీఎం యోగి ప్రభుత్వం ఆ భయం నుండి మహిళలకు విముక్తి కల్పించిందన్నారు. తాము మహిళలకు నిజమైన గౌరవం ఇచ్చామన్నారు.













Click it and Unblock the Notifications