ప్రశాంతంగా ముగిసిన యూపీ నాలుగో విడత పోలింగ్..
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుంది. అధికారం కోసం ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. అధికార బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్నాయి. బుధవారం నాలుగో విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.
నాలుగో విడత పోలింగ్ 57.45శాతం
యూపీ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ మొత్తం తొమ్మిది జిల్లాల పరిధిలోని 59 అసెంబ్లీ నియోజవకర్గాల్లో పోలింగ్ నిర్వహంచారు. ఉదయం 7గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి.. తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5గంటల వరకు 57.45శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

బరిలో 624మంది అభ్యర్థులు
మొత్తం 59 నియోజకవర్గాల్లో 624మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఈ స్థానాల్లో మొత్తంగా 2.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. నాలుగో విడత పోలింగ్ కోసం ఎన్నికల సంఘం 13,817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. గతంలో కంటే పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. గత 2017లో జరిగిన ఈ 59 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 51 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి హోరా హోరీగా ఎన్నికలు జరిగాయి. పోటీలో అభ్యర్థుల జాతకాలు ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం అయి ఉన్నాయి. మార్చి 10 ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Fourth phase #UttarPradeshElections voter turn out till 5 pm- 57.45% with Kheri (Lakhimpur Kheri) recording highest turnout at 62.42%, followed by Pilbhit 61.33% and Raebareili 58.40% pic.twitter.com/QFH84TLPtC
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 23, 2022












Click it and Unblock the Notifications