షాక్: యూపి సిఎం రేసులో ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్యకు అస్వస్థత, ఐసియూలో చికిత్స

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ బిజెపి చీఫ్ , ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్య అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఆర్ ఎం ఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కేశవ్ ప్రసాద్ మౌర్య కు బిపి , ఛాతీ నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి ఘన విజయం సాధించింది. అయితే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి రేసులో కేశవ్ ప్రసాద్ మౌర్య పేరు కూడ ప్రముఖంగా ఉంది.

Uttar Pradesh BJP president Keshav Prasad Maurya admitted to RML hospital

కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, మనోజ్ సిన్హా, యోగి ఆదిత్యానాద్ పేర్లు కూడ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించారు.అయితే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు సిఎం పదవికి అభ్యర్థిని నియమించే అధికారాన్ని కట్టబెడుతూ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకొంది. ఈ సమయంలో మౌర్య అస్వస్థతకు గురికావడం పట్ల ఆయన సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి ఎవరిని ఎంపిక చేస్తారనే ఉత్కంఠ ఇంకా నెలకొంది. ఈ విషయమై పార్టీ చీఫ్ అమిత్ షా ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్య అస్వస్థతతో ఆసుపత్రిలో చేరడం ఆయన సన్నిహితులను కలవరపాటుకు గురిచేస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Uttar Pradesh BJP president Keshav Prasad Maurya admitted to Delhi's RML hospital on Thursday with complaints of low blood pressure and chest pain.
Please Wait while comments are loading...