జీహాదీ, మాఫియా, గూండాల ప్రభుత్వం కావాలా, యూపీలో అంతం చేశాం: సిద్దూకు భయం, యోగీ!

మంగళూరు: కర్ణాటకలో మళ్లీ సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీహాదీలు, గూండాలు, మాఫియా ముఠా సభ్యులకు కేంద్రంగా మారిపోతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహాదీలను ప్రోత్సహించే సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి మీరు మళ్లీ ఓట్లు వేస్తారా అని యోగీ ఆదిత్యనాథ్ కన్నడిగులను ప్రశ్నించారు. యూపీలో జీహాదీలు, గూండాలను అంతం చేశామని, తాను ఇక్కడికి వస్తే సిద్దూకు భయం అని యోగీ ఆదిత్యనాథ్ వ్యంగంగా అన్నారు.

జాతిని నాశనం చేస్తున్నారు

జాతిని నాశనం చేస్తున్నారు

దక్షిణ కన్నడ జిల్లాలోని సుళ్యలో బీజేపీ అభ్యర్థి ఎస్. అంగారకు మద్దతుగా ప్రచారం చేస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కర్ణాటకలో కులాలు, మతాలను విడదీస్తున్న సిద్దరామయ్య జాతిని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. వీలైతే అన్ని కులాలను ఒక్కటి చెయ్యాలని, ఇలా విడదీసి విభజించు పాలించు అని చాటి చెప్పరాదని యోగీ ఆదిత్యనాథ్ హితవుపలికారు.

నేనంటే సిద్దూకు భయం

నేనంటే సిద్దూకు భయం

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు నేను ఇక్కడికి రావడం ఇష్టం లేదని యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. సిద్దరామయ్యకు నేనంటే భయం అని, అందుకే నేను ఎప్పుడు వచ్చినా నా మీద నిఘా వేసి ఉంటారని యోగీ ఆదిత్యనాథ్ వ్యంగంగా అన్నారు.

ఉత్తరప్రదేశ్ లో అంతం చేశాం

ఉత్తరప్రదేశ్ లో అంతం చేశాం

ఉత్తరప్రదేశ్ లో తాను అధికారంలోకి రాకముందు జీహాదీలు, గూండాల రాజ్యం ఉండేదని, తాను అధికారం స్వీకరించిన ఒక్క సంవత్సరం పూర్తి కాకముందే వారిని అంతం చేశామని యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇక్కడ జీహాదీలు, గూండాలను ప్రోత్సహిస్తున్నారని యోగీ ఆదిత్యనాథ్ ఆరోపించారు.

గోహత్యలకు ప్రోత్సాహం

గోహత్యలకు ప్రోత్సాహం

ఉత్తరప్రదేశ్ లో అక్రమ గోహత్య కేంద్రాలను తాము శాశ్వతంగా మూసివేశామని యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అయితే కర్ణాటకలో అక్రమ గోహత్య కేంద్రాలు విచ్చలవిడిగా ఉన్నాయని, వాటిని ఇక్కడి సీఎం సిద్దరామయ్య ప్రోత్సహిస్తున్నారని యోగీ ఆదిత్యనాథ్ ఆరోపించారు.

86 లక్షల రైతుల రుణాలు మాఫీ

86 లక్షల రైతుల రుణాలు మాఫీ

ఉత్తరప్రదేశ్ లో తాను అధికారం స్వీకరించిన తరువాత 86 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశామని యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు. కర్ణాటకలో వక్క చెట్ల వ్యవసాయాన్ని సీఎం సిద్దరామయ్య నాశనం చేశారని యోగీ ఆదిత్యనాథ్ ఆరోపించారు. లోక్ సభలో వక్కలు ఆరోగ్యానికి హానికరం అని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేసి వక్క చెట్ల రైతుల జీవితాలను నాశనం చేశారని యోగీ ఆదిత్యనాథ్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+