Yogi Adityanath : జనతా దర్శన్ లో ప్రతీ ఫిర్యాదూ పరిష్కరిస్తా-యూపీ ప్రజలకు యోగీ భరోసా..

ఉత్తర్ ప్రదేశ్ లో తాజాగా జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో 17కు 17 కార్పోరేషన్లతో పాటు పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఘన విజయాలు సాధించిన సీఎం యోగీ ఆదిత్యనాథ్.. ప్రజల్ల మిగిలిన కాస్త అసంతృప్తిని పారద్రోలే పనిలో బిజీగా కనిపిస్తున్నారు. రెగ్యులర్ గా నిర్వహించే జనతా దర్శన్ కార్యక్రమంలో ప్రజలు చేస్తున్న ఫిర్యాదులపై స్పందించిన యోగీ ఆదిత్యనాథ్..వాటిలో ప్రతీదీ పరిష్కారిస్తా, ఆందోళన చెందవద్దని ప్రజలకు సూచించారు.

ప్రజు చింతించవద్దని, ప్రతి ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ జనతా దర్శన్ కు హాజరైన ఫిర్యాదదారులను ఉద్దేశించి హామీ ఇచ్చారు. సమస్య ఏదైనా సరే పరిష్కరిస్తామని యోగి గోరఖ్‌నాథ్ ఆలయానికి 'జనతా దర్శన్ కు చేరుకున్న ప్రజలకు హామీ ఇచ్చారు. ఏప్రిల్ 9న గోరఖ్‌నాథ్ ఆలయంలో చివరి 'జనతా దర్శన్' జరిగింది. మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా దాదాపు నెల రోజుల తర్వాత దీన్ని నిర్వహించారు.

 yogi adityanath

ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను చెప్పుకునేందుకు దాదాపు 100 మంది జనతా దర్శన్‌కు వచ్చారు. ఆలయ సముదాయంలోని మహంత్ దిగ్విజయ్‌నాథ్ స్మృతి భవన్ ముందు కుర్చీలపై కూర్చున్న ప్రజల వద్దకు ముఖ్యమంత్రి యోగి స్వయంగా చేరుకున్నారు. సీఎం యోగి అందరి సమస్యలను ఒక్కొక్కటిగా వింటూ, వారి సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

వారి దరఖాస్తులను అధికారులకు అందజేసి, సత్వరమే సంతృప్తికరంగా ఉండేలా చూడాలని యోగీ ఆదిత్యనాథ్ ఆదేశించారు. కొంతమంది భూకబ్జాలకు పాల్పడినట్లు ఫిర్యాదు చేయడంతో కఠిన చర్యలు తీసుకోవాలని యోగీ ఆదేశించారు. కరెంటు బిల్లుల్లో రాయితీలు కోరుతున్న మహిళలకు కూడా ముఖ్యమంత్రి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చికిత్స కోసం ఆర్థిక సహాయం కోరుతూ కొంతమంది జనతా దర్శన్‌కు వచ్చారు. వీరి చికిత్సకు నిధుల కొరత అడ్డంకి కాదని సీఎం యోగి అన్నారు. చికిత్స కోసం ఆసుపత్రి అంచనాల ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి విచక్షణా నిధి నుంచి చికిత్సకు తగిన మొత్తాన్ని అందజేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+