ఇంటర్వ్యూ మధ్యలో ఆపేసి బీజేపీ అగ్రనేత రచ్చ- హరిద్వార్ విద్వేష ప్రసంగాలపై ప్రశ్నలతో

గత నెలలో ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరిగిన ధర్మ సంసద్ లో హిందూ అతివాదుల విద్వేష ప్రసంగాలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక యూపీ డిప్యూటీ సీఎం మధ్యలోనే ఇంటర్వ్యూ వదిలేసి వెళ్లిపోయిన ఘటన చోటు చేసుకుంది. అంతే కాదు ఆ ఇంటర్వ్యూ ఫుటేజ్ ను కూడా డిలీట్ చేయాలని కోరడం సంచలనం రేపింది.

బీబీసీ తాజాగా యూపీ డిప్యూటీ సీఎం అయిన మౌర్యను ఇంటర్వ్యూ చేసింది. ఇందులో హరిద్వార్ లో నిర్వహించిన ధర్మ సంసద్ కార్యక్రమంలో నేతల విద్వేష ప్రసంగాలపై బీజేపీ నేతల మౌనాన్ని బీబీసీ ఎడిటర్ ఆయన్ను ప్రశ్నించారు. అలాంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్పందించడం ద్వారా నాయకులు ప్రజలకు భరోసా ఇవ్వాలా వద్దా అని అడిగిన ప్రశ్నకు, మౌర్య స్పందిస్తూ.. మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మేము సబ్కా సాత్, సబ్కా వికాస్ (అందరి అభివృద్ధి మరియు మద్దతు)ని నమ్ముతాము. మత నాయకులకు హక్కు ఉందన్నారు.

uttar pradesh deputy cm stops bbc interview over haridwar hate speeches questions

దీంతో ఆయన కేవలం హిందూ మత పెద్దలు మాత్రమే ఎందుకు అందరి దష్టిలో పడుతున్నారని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ''హిందూ నేతల గురించి మాత్రమే ఎందుకు అడుగుతున్నారు? ఇతర మత పెద్దలు చేసిన వ్యాఖ్యల గురించి ఎందుకు ప్రశ్నించరని అడిగారు ? ఆర్టికల్ 370 రద్దు చేయడానికి ముందు ఎంతమంది జమ్మూ కాశ్మీర్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరన్నారు. ధర్మ సంసద్ బీజేపీ కార్యక్రమం కాదు. ఇది మత పెద్దలదంటూ మౌర్య వ్యాఖ్యానించారు. చూసే వారు తాము నమ్మేది చెప్పగలరు. ఇది రాజకీయాలకు సంబంధించినది కాదు. ముస్లిం, క్రైస్తవ నాయకులు కూడా ఉన్నారు. వారి గురించి కూడా మాట్లాడండంటూ ఎడిటర్ కు మౌర్య హితవు పలికారు.

ఇలాంటి ప్రసంగాలు ఎన్నికలకు ముందు వాతావరణాన్ని పాడు చేశాయని, దీనికి రాజకీయాలతో సంబంధం లేదని ఇంటర్వ్యూ చేసి వ్యక్తి ఆక్షేపించారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో లేవనెత్తిన నినాదాలపై దేశద్రోహం ఆరోపణలను కూడా లేవనెత్తారు. దేశద్రోహం అనేది వేరే అంశం. కానీ ఇది ధర్మ సంసద్. సూర్య నమస్కారానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు లేదని మేము చెప్పగలం" అని మౌర్య బదులిచ్చారు. వివాదాస్పద మత సమ్మేళనంలో లేవనెత్తిన మారణహోమం కాల్స్ గురించి ప్రశ్నించగా.. మీరు ఏ వీడియో గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. మీరు ఎన్నికల గురించి అడుగుతున్నారా? మీరు జర్నలిస్టులా మాట్లాడటం లేదు. మీరు ఒక ఏజెంట్ లాగా మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూలో నేను మీతో మాట్లాడనంటూ లేచి వెళ్లిపోయారు. ఆనంతరం ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి మౌర్య దీనినో దురదృష్టకర సంఘటనగా అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+