అఖిలేష్ కు మద్దతుగా దీదీ-రేపు వారణాసిలో ఎదురెదురుగా రాజకీయ ప్రత్యర్ధులు
రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న ప్రధాని మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రేపు ఒకే చోట పర్యటించబోతున్నారు. యూపీ ఎన్నికల ఆరోదశ పోరు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ తన నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్నారు. అలాగే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారం కోసం వారణాసికి వస్తున్నారు. అదీ అఖిలేష్ కు మద్దతుగా కావడం మరో విశేషం.
ఉత్తరప్రదేశ్‌లో చివరి రెండు దశల అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం వారణాసిలో పర్యటించబోతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో కలిసి ఉమ్మడి ర్యాలీలో ప్రసంగించనున్నారు. మమత పర్యటన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు రోజుల పర్యటనతో సమానంగా ఉంటుందని అంచనా వేస్తున్నాు. రాష్ట్రంలో ఇది ఆమె రెండో పర్యటన. ఫిబ్రవరి మొదటి వారంలో రెండు రోజులు మమత యూపీలో పర్యటించారు.

Recommended Video
తృణమూల్ కాంగ్రెస్ యూపీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం లేదు. కానీ మమత మాత్రం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ నుంచి కొన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధమవుతుందని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లలితేష్‌పతి త్రిపాఠి టిఎంసిలో చేరిన తర్వాత రాష్ట్రంలో తృణమూల్ యూనిట్ ప్రారంభించేందుకు మమత సిద్ధమవుతున్నారు. యూపీ టూర్ లో భాగంగా మమత కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. గతేడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ అక్కడ పర్యటించి టీఎంసీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఇప్పుడు మమత దానికి కొనసాగింపుగా అఖిలేష్ కు మద్దతిస్తున్నారు.












Click it and Unblock the Notifications