ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు: మంత్రికి ఉద్వాసన
లక్నో: ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తర ప్రదేశ్ మంత్రి ఓంపాల్ నెహ్రాకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికారు. ఈ మేరకు ఆయన్ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్ శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు.
బిజ్నోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఓంపాల్ నెహ్రా గురువారం రాత్రి మాట్లాడుతూ ముస్లింలు హిందూ దేవాలయాల నిర్మాణానికి సహకరించాలంటూ వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగితే ముస్లింలు అందుకు సహకరించాలని, కరసేవలో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన సూచించారు.

అదే విధంగా మథురలో కృష్ణ దేవాలయ నిర్మాణానికి మద్దతు ఇవ్వాలని ఓంపాల్ నెహ్రా పేర్కొన్నారు. మంత్రి ఓంపాల్ నెహ్రా వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో సీఎం అఖిలేష్ యాదవ్ ఆయన్ను శుక్రవారం ఉదయం కేబినెట్ నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ఇప్పటికే విశ్వహిందూ పరిషత్ శిలాసేకరణ ప్రారంభించింది. అంతేకాకుండా మందిర నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులూ సృష్టించొద్దని ముస్లింలకు ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది. 16వ శతాబ్దానికి చెందిన బాబ్రీ మసీదుని డిసెంబర్ 6, 1992వ తేదీన హిందూ మత కార్యకర్తలు కూలదొసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications