రేప్ చేసి కదులుతున్న రైల్లోంచి ఆమెను తోసేశారు
మౌ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రైలులో ఇంటికి వెళ్తున్న మహిళపై దుండగులు అత్యాచారం చేశారు. దాంతో ఆగకుండా ఆమెను రైలు నుంచి కిందకు తోసేశారు. దాంతో ఆమె కుడికాలును కోల్పోయింది.
బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. జౌన్‌పూర్ జిల్లాలోని షాగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ (35) ఇంటికి వెళ్లేందుకు శుక్రవారం రాత్రి మౌ జిల్లాలో తాంసా ప్యాసింజర్ రైలు ఎక్కింది. ఇద్దరు దుండగులు ఆమెపై లైంగికదాడి చేసి కదులుతున్న రైలు నుంచి కిందికి తోసేశారు.

కుర్హత్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాల వెంట నగ్నంగా పడి ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తొలుత స్థానిక రైల్వే ఆస్పత్రిలోో చికిత్స అందించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారణాసి ఆస్పత్రికి తరలించారు.
యూపీలో ఈ నెల మొదట్లో కాలేజీ విద్యార్థిని మెడలోని గొలుసును చోరీచేసే క్రమంలో ఓ దొంగ కదిలే రైలు నుంచి తోసివేయడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. రైలు ప్రమాదాల్లో దేశంలో మహారాష్ట్ర తర్వాత యూపీ రెండోస్థానంలో ఉంది. బాధితురాలి ఫొటోగ్రాఫ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications