Sun Halo: సూర్యుడి చుట్టూ..: బెంగళూరు, హైదరాబాద్ తరువాత ఇప్పడిక్కడ
డెహ్రాడున్: ఆకాశంలో తరచూ కొన్ని అద్భుత దృశ్యాలు కనిపిస్తుంటాయి. వర్షం పడే సమయంలో అవి మరింత కనువిందు చేస్తుంటాయి. వర్షం పడిన తరువాతా మరింత మనోహరంగా మారుతుంటాయి. అలాంటిదే ఇదీనూ. సూర్యుడి చుట్టూ ఏర్పడిన వర్ణ వలయం కనువిందు చేసింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో తాజాగా ఇది కనిపించింది. సూర్యుడి చుట్టూ ఏర్పడిన ఇంద్రధనస్సును స్థానికులు తమ కెమెరాల్లో బంధించారు. వీడియోలు తీశారు.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గత సంవత్సరం వర్షాకాల సమయంలో బెంగళూరులో మనోహరంగా కనిపించిన సన్ హాలో. ఆ తరువాత మన భాగ్యనగరంలోనూ దర్శనం ఇచ్చింది. ఇప్పుడిక డెహ్రాడూన్‌లో ప్రత్యక్షమైంది. సూర్యుడి చుట్టూ సప్త వర్ణాల వలయం ఆవరించింది. కొన్ని గంటలపాటు కొనసాగింది. ఉత్తరాఖండ్‌లో పర్వత ప్రాంతాల్లోనూ ఈ అపురూప దృశ్యం కనిపించింది.
ఇలా కొత్తగా కనిపించిన సూర్యుడిని ఫొటోలు, వీడియోలు తీయడానికి జనం ఎగబడ్డారు. తమ మొబైల్ ఫోన్లలో క్లిక్‌మనిపించారు. ఆకాశం మేఘావృతం కావడం వల్ల మరి కొన్ని ప్రాంతాల ప్రజలు ఈ అద్భుతాన్ని చూడలేకపోయారు. సూర్యుడి చుట్టూ ఇలా ఇంద్రధనస్సు లాంటి వలయం కనిపించడాన్ని సన్ హాలో (Sun Halo)గా పేర్కొంటారు. 22 డిగ్రీ హాలోగా కూడా పిలుస్తుంటారు. వాతావరణంలో ఏర్పడే మార్పుల వల్ల ఇది కనిపిస్తుంటుంది.

వాతావరణం ఎగువ భాగాన ఉండే సైర్రస్ క్లౌడ్స్ వల్లే ఆ హాలో ఏర్పడుతుంటుంది. వాతావరణానికి 22 వేల అడుగుల ఎత్తులో ఈ క్లౌడ్స్ ఆవిర్భవిస్తుంటాయి. వాటి గుండా కాంతి ప్రసరించినప్పుడు హెక్సాగొనల్ మంచు స్ఫటికాలతో దాన్ని అడ్డుకునే క్రమంలో అది విచ్ఛిన్నమౌతుంది. సైర్రస్ క్లౌడ్స్‌లో చిన్నచిన్న మంచు స్ఫటికాలు లె్క్క పెట్టలేనన్ని ఉంటాయి. వాటి గుండా సూర్యరశ్మి భూమి మీదికి ప్రసరించిన సమయంలో అది పరావర్తనం చెందుతుంది.
ఇలా సన్ హాలో ఏర్పడితే.. వచ్చే 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని స్కై వాచర్స్ చెబుతుంటారు. అప్పట్లో బెంగళూరు, హైదరాబాద్‌లల్లో కూడా ఈ సన్ హాలో ఏర్పడిన తరువాత వర్షం కురిసింది. దీన్ని సాధారణ కంటితో చూసే అవకాశం ఉన్నప్పటికీ.. సూర్యడి వెలుగును మన కంటి చూపు భరించలేదు.












Click it and Unblock the Notifications