గాయపడ్డ శక్తిమాన్ మృతి: 'ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే'

న్యూఢిల్లీ: శక్తిమాన్... బీజేపీ ఎమ్మెల్యే చేతిలో దారుణంగా దెబ్బలు తిని దేశ వ్యాప్తంగా సానుభూతి పొందిన ఉత్తరాఖండ్‌కు చెందిన గుర్రం బుధవారం చనిపోయింది. గత నెలలో ఉత్తరాఖండ్‌లో హరీశ్‌ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనకారులకు, పోలసులకు మధ్య జరిగిన ఘర్షణలో శక్తిమాన్ గాయపడింది.

Uttarakhand Police Horse Shaktiman, Injured During BJP Protest, Dies

దీంతో శక్తిమాన్ కాలికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి ఒక కాలిని తొలగించారు. ఆ కాలి స్థానంలో కృత్రిమ కాలును అమర్చి.. వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. శక్తిమాన్ కోలుకోవాలంటూ అభిమానులు పెద్దఎత్తున ప్రార్ధనలు కూడా చేశారు. అయితే కృత్రిమ కాలుతో శక్తిమాన్ నొప్పితో బాధపడిందని గతంలో పోలీసులు తెలిపారు.

ఇన్నాళ్లు ప్రాణాలతో పోరాడిన శక్తిమాన్ బుధవారం తుదిశ్వాస విడిచింది. కాగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే శక్తిమాన్ చనిపోయిందని, దానికి సరైన చికిత్స అందించలేదని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ ఆందోళనలో గాయపడిన కారణంగా ఈ గుర్రానికి సరైన వైద్యం అందించకుండా చనిపోయేలా హరీశ్ రావత్ ప్రభుత్వం చేసిందని బీజేపీ నేత అజయ్‌ భట్ ఆరోపించారు.

వివరాల్లోకి వెళితే....:

మార్చి 14న డెహ్రాడూన్‌లో బీజేపీ నిర్వహించిన ఆందోళన సందర్భంగా శక్తిమాన్ గాయపడింది. బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషి లాఠీతో బాధపడటం వల్లే ఈ గుర్రం గాయపడిందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను అరెస్టు కూడా చేశారు. గణేశ్ జోషి గుర్రాన్ని కొడుతున్నట్టు వీడియో కూడా వెలుగులోకి వచ్చింది.

Uttarakhand Police Horse Shaktiman, Injured During BJP Protest, Dies

ఆయన మాత్రం తాను గుర్రాన్ని కొట్టలేదని, తన వల్ల అది గాయపడలేదని వాదించారు. ఆ తర్వాత శక్తిమాన్‌కి కృత్రిమ కాలు అమర్చారు. దీని కోసం జరిగిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. కృత్రిమ కాలుపై గుర్రం లేచి నిలబడుతోందని ఆపరేషన్ చేసిన డాక్టర్ ఖంబాటా తెలిపారు.

Uttarakhand Police Horse Shaktiman, Injured During BJP Protest, Dies

ఎమ్మెల్యే దాడిలో గాయపడ్డ గుర్రం (శక్తిమాన్) ప్రాణాలు కాపాడేందుకు దాని కాలును తొలగించాలని సైనిక వైద్యులు నిర్ణయించడం, అలా చేయకుండా అలాగే ఉంచేస్తే గాంగరిన్ కారణంగా అది చనిపోయే ప్రమాదం ఉండటంతో కాలును ఆపరేషన్ చేసి తొలగించిన సంగతి తెలిసిందే. అయినా సరే శక్తిమాన్ చనిపోవడం బాధాకరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+