యూపీ గోరఖ్ నాథ్ ఆలయంలో 9 విగ్రహాలకు యోగీ ఆదిత్యనాథ్ ప్రాణప్రతిష్ట...
యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తన స్వస్ధలం, గోరఖ్ నాథ్ ఆలయంలో ఓ కీలక కార్యాన్ని పూర్తి చేశారు. ఈ ఆలయంలో 9 విగ్రహాలకు యోగీ ప్రాణప్రతిష్ట చేశారు. రెండు దశల్లో జరిగిన ఈ కార్యక్రమంలో రెండో దశ ఆదివారం పూర్తి చేశారు. ఈ నెల 8, 15 తేదీల్లో రెండు దశల్లో మొదలైన ఈ విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిన్నటితో ముగిసింది. ఇందులో సీతారాముల విగ్రహాలతో పాటు పలు విగ్రహాలు ఉన్నాయి.
గోరక్షా పీఠాధిపతి హోదాలో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గోరఖ్ నాథ్ ఆలయంలో కొత్తగా నిర్మించిన ఆలయాల్లో ఈ విగ్రహాలను ప్రతిష్టించారు. భాగవత పఠనం మధ్య లక్ష్మీనారాయణ మహాయజ్ఞం నిర్వహించి యోగీ ఈ విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమం కోసం శుక్రవారమే గోరఖ్ నాథ్ ఆలయానికి చేరుకున్న యోగీ ఆదిత్యనాథ్.. ఆదివారం కల్లా శాస్త్రబద్ధంగా దీన్ని పూర్తి చేశారు.

ఈ సందర్భంగా వ్యాసపీఠంలో యోగీ ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అలాగే ఈ ఆలయాలు, విగ్రహాలు నిర్మించిన శిల్పులు, ఆర్కిటెక్ట్ లు, ఇతర నిపుణులు, అధికారుల్ని యోగీ ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో ప్రజలు శుఖసంతోషాలతో వర్దిల్లాలని యోగీ ఈ సందర్భంగా దేవతల్ని వేడుకున్నారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ కార్యక్రమాలు సాఫీగా సాగిపోవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆలయాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాని అధికారుల్ని యోగీ ఆదేశించారు.












Click it and Unblock the Notifications