అదృష్టం కలిసొస్తే... కోటీశ్వరుడు కానున్న వడాపావ్ వ్యాపారి..!
ముంబై: 165 చదరపు అడుగలు విస్తీర్ణమున్నగదిలో తన సోదరుడి కుటుంబంతో కాలం గడిపే ప్రేమ్ తేజుమాల్ గురుదాసానిని అదృష్టం పలకరించింది. అంతా బాగుంటే త్వరలోనే అతినికి రూ. 7 కోట్ల విలువైన ఆస్తికి అతను హక్కుదారుడు కానున్నాడు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
వివరాల్లోకి వెళితే ముంబైలో వడా పావ్ వ్యాపారం చేసుకుంటూ రోజుకు రూ. 150 సంపాదిస్తున్నాడు ప్రేమ్ తేజు మాల్ గురుదాసాని. ఇండియా, పాకిస్దాన్ విడిపోయిన తర్వాత ఉద్యోగిగా ఉన్న ప్రేమ్ తాత రాధోమల్ మిన్హోమల్ చిచారియా అలియాస్ గురుదాసానిని పాక్ అధికారులు ఇండియాకు పంపించారు.

ముంబైలోని ఉల్లాస్ నగర్ పరిధిలో 9.5 ఎకరాల విస్తీర్ణమున్న రెండు ప్లాట్‌లను ఇచ్చి ప్రభుత్వం పునరావాసాన్ని కల్పించింది. ఆయన చనిపోయన తర్వాత ముంబై మాఫియా, ఓ మహిళను ఆయన భార్యగా చూపించి ఆ స్ధలాన్ని విక్రయించింది.
ఇటీవలే ఆ విషయాన్ని తెలుసుకున్న ప్రేమ్ సమాచార హక్కు చట్టాన్ని వినియోగించి పలు ప్రభుత్వ విభాగాల నుంచి తన తాతకు సంబంధించిన స్ధలంపై సాక్ష్యాలు సేకరించి పోలీసులు కేసు పెట్టాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు మాఫియా ముఠాలోని మనోజ్ చిచారియా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఆస్తికి ప్రస్తుతం ప్రేమ్ సోదరితో పాటు మరో ఇద్దరు పిన తండ్రి కుమారులు వారసులుగా ఉన్నారు. ఈ 9.5 ఎకరాల భూమి విలువ ప్రస్తుతం రూ. 35 కోట్లు ఉంటుందని, తన వాటా కింద రూ. 7 కోట్లు రానుందని ప్రేమ్ భావిస్తున్నాడు.












Click it and Unblock the Notifications