అంతా ఆంధ్రొళ్లే: షాకిచ్చిన తమిళ కూలీ, ఇంకా మోడీ మౌనమా?
హైదరాబాద్/చెన్నై: అసలైన ఎర్ర చందనం స్మగర్లు ఆంధ్రొళ్లేనని, ఏజెంట్లంతా అక్కడి వారేనని ఓ చానల్‌తో ఎర్ర చందనం కూలి వ్యాఖ్యానించాడు. ఆయన తమిళనాడులోని ఓ చానల్‌తో మాట్లాడాడు. ఆ కూలీ షాకింగ్ విషయాలు చెప్పాడు. ఆంధ్రాకు చెందిన స్మగర్లు, ఏజెంట్లు తమ పల్లెలకు వచ్చి ఎర్ర చందనం చెట్లు నరికే పని కోసం ఎక్కువ కూలీ ఆశ చూపుతున్నారని చెప్పాడు.
శేషాచలంలో జరిగిన ఎన్‌కౌంటర్లో మరణించిన వారిలో చాలామంది ఈ పనికి కొత్తవారేనని చెప్పాడు. డబ్బులకు ఆశపడి వారంతా ఇలా ప్రాణాలు పోగొట్టుకున్నారని వాపోయాడు. కొత్తవాళ్లు ఎవరు ఈ పనికి రావొద్దని, వస్తే ప్రాణాలకు ప్రమాదమన్నాడు. ఈ కూలి తన పేరు వెల్లడించకుండా ముసుగేసుకొని ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ప్రధాని మౌనం ఎలా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం కూలీల బూటకపు ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తి లేదా సిబిఐతో విచారణ జరిపించాలని ఎన్డీయే మిత్రపక్షం పీఎంకే డిమాండ్ చేసింది. అమాయక తమిళ కూలీలను కాల్చివేసినా ప్రధాని మౌనం వహించడం దారుణమని ఆ పార్టీ వ్యవస్థాపకులు రాందాస్ అన్నారు.
శేషాచలం అడవుల్లో అమాయకులను చంద్రబాబు ప్రభుత్వం పొట్టనబెట్టుకుందన్నారు. సంఘటన జరిగిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఏపి ఎసిం చంద్రబాబుకు లేఖ రాశారని, ప్రధాని మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడంపై ఆయన విమర్శలు గుప్పించారు.
సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రధాని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి జరిగిన సంఘటనపై విచారణ వ్యక్తం చేయడం, ఓదార్చడం చేస్తుంటారని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ ఇక్కడ అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సరిహద్దులో టెన్షన్ టెన్షన్
ఏపీ - తమిళనాడు సరిహద్దులో శుక్రవారం కూడా ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. వైకో చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో సరిహద్దులో భారీగా మోహరించారు. చెక్ పోస్టుల వద్ద బందోబస్తు పెంచారు. వేలూరు నుండి ర్యాలీ మొదలు కానుంది. ఎండీఎంకే పార్టీ కార్యకర్తలను సమీకరించే పనిలో పడింది.












Click it and Unblock the Notifications