కెనాల్ లోకి పల్టీ కొట్టిన వ్యాన్: ఐదుగురు మృతి
మండ్య: వేగంగా వెళుతున్న వ్యాన్ అదుపుతప్పి కెనాల్ లోకి పల్టీ కొట్టడంతో ఐదుగురు మరణించిన సంఘటన కర్ణాటకలోని మండ్య జిల్లాలో జరిగింది. శ్రీరంగపట్టణం సమీపంలో బుధవారం మద్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.
మండ్య జిల్లా శ్రీరంగపట్టణం తాలుకా బెళగూళ గ్రామం సమీపంలో వ్యాన్ వేగంగా వెళుతున్న సమయంలో అదుపు తప్పింది. తరువాత రోడ్డు మీద నుండి వరుణా కెనాల్ లోకి పడిపోయింది. విషయం గుర్తించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

బాధితులను రక్షించడానికి ప్రయత్నించారు. అయితే వ్యాన్ డ్రైవర్ తోపాటు ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు మరణించారు. స్పందనా బాల న్యాయమండలికి చెందిన వ్యాన్ లో మహిళలు, పిల్లలు వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు.
విషయం తెలుసుకున్న కేఆర్ఎస్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వ్యాన్ డ్రైవర్ వేగంగా నిర్లక్ష్యంగా వాహనం నడపడం వలనే ప్రమాదం జరిగిందని కేఆర్ఎస్ పోలీసులు అన్నారు. కెనాల్ లో పడిన వ్యాన్ ను బయటకు తియ్యడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications