వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Varanasi: హిందువులకు స్వాగతం, హిందువులు కాని వాళ్లు వెళ్లిపోండి, వార్నింగ్, మోడీ ఇలాకాలో!

|
Google Oneindia TeluguNews

వారణాసి/లక్నో: భారతదేశంలో అతి పురాతణ నగరాల్లో వారణాసి కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన వారణాసి (కాశీ) ప్రముఖ పర్యాటక కేంద్రంగాను మారిపోయింది. వారణాసిలోని గంగానది తీరంలో వందల సంఖ్యలో హిందూ దేవాలయాలు, ఘాట్ లు ఉన్నాయి. ప్రతినిత్యం కొన్ని లక్షల మంది వారణాసి గంగా ఘాట్ లను సందర్శిస్తుంటారు. ఇలాంటి వారణాసిలో ఇప్పుడు కొన్ని పోస్టర్లు వెయ్యడం కలకలం రేపింది.

గంగా ఘాట్ లు, గంగా నది తీరంలో ఉన్న హిందూ దేవాలయాలకు హిందువులు కాని వారు దూరంగా ఉండండి, ఇది మా మనవి, అభ్యర్థన కాదు, వార్నింగ్ అంటూ హెచ్చరిస్తు ముద్రించిన పోస్టర్లు వారణాసిలో దర్శనం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. హిందువులు కాని వారు వారణాసిలోని గంగా ఘాట్ లకు వచ్చి ఇక్కడ బ్రష్టుపట్టిస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

గంగా ఘాట్ లు, ఇక్కడి దేవాలయాలకు వచ్చే హిందువులకు స్వాగతం, హిందువులు కాని వారు ఇక్కడికి రాకూడదని హెచ్చరిస్తున్నామని వీహెచ్ పీ, భజరంగ్ దళ్ పేర్లతో పోస్టర్లు దర్శనం ఇవ్వడం కలకలం రేపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇదే వారణాసి లోక్ సభ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Sketch: అందమైన అక్కాచెల్లెలు, భర్తలతో విడాకులు, ఒకేసారి ఇద్దర్నీ చంపేసి ఎస్కేప్, పక్కాస్కెచ్!Sketch: అందమైన అక్కాచెల్లెలు, భర్తలతో విడాకులు, ఒకేసారి ఇద్దర్నీ చంపేసి ఎస్కేప్, పక్కాస్కెచ్!

వారణాసి అంటే హిందువుల పుణ్యక్షేత్రం

వారణాసి అంటే హిందువుల పుణ్యక్షేత్రం

ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన వారణాసి (కాశీ) ప్రముఖ పర్యాటక కేంద్రంగాను మారిపోయింది. వారణాసిలోని గంగానది తీరంలో వందల సంఖ్యలో హిందూ దేవాలయాలు, ఘాట్ లు ఉన్నాయి. ప్రతినిత్యం కొన్ని లక్షల మంది వారణాసి గంగా ఘాట్ లను సందర్శిస్తుంటారు. కుటుంబంలోని పెద్దలు చనిపోతే వారణాసిలోని గంగా ఘాట్ లో వారి పేరుతో ప్రత్యేక పూజలు చేయిస్తే వారి ఆత్మశాంతిస్తుందని, మా కుటుంబాలకు మంచి జరుగుతుందని చాలా మంది హిందువులు నమ్ముతుంటారు.

రాత్రికి రాత్రి వార్నింగ్ పోస్టర్లు

రాత్రికి రాత్రి వార్నింగ్ పోస్టర్లు

వారణాసిలోని గంగా ఘాట్ లు, గంగానది తీరంలో ఉన్న హిందూ దేవాలయాల దగ్గర రాత్రికి రాత్రి కొందరు వేసిన పోస్టర్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. హిందువులు వారణాసికి ఎప్పుడైనా రావచ్చు, అయితే హిందువులు కాని వారు వారణాసిలోని గంగా ఘాట్ లు, గంగానది తీరంలో ఉన్న దేవాలయాల పరిసర ప్రాంతాలకు రాకూడదని పోస్టర్లలో హిందీలో ముద్రించారు.

మా మనవి కాదు...... వార్నింగ్

మా మనవి కాదు...... వార్నింగ్

గంగా ఘాట్ లు, గంగా నది తీరంలో ఉన్న హిందూ దేవాలయాలకు హిందువులు కాని వారు దూరంగా ఉండండి, ఇది మా మనవి, అభ్యర్థన కాదు, వార్నింగ్ అంటూ హెచ్చరిస్తు ముద్రించిన పోస్టర్లు వారణాసిలో దర్శనం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. వీహెచ్ పీ, దాని అనుబంధం సంస్థ భజరంగ్ దళ్ యువజవ విభాగం పేరుతో వారణాసిలో పోస్టర్లు అతికించారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

వారణాసి పిక్నిక్ పాయింట్ కాదు...... పవిత్ర స్థలం

వారణాసి పిక్నిక్ పాయింట్ కాదు...... పవిత్ర స్థలం

హిందువులు కాని వారు వారణాసిలోని గంగా ఘాట్ లకు వచ్చి ఇక్కడ బ్రష్టుపట్టిస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. గంగా ఘాట్ లు, ఇక్కడి దేవాలయాలకు వచ్చే హిందువులకు స్వాగతం, హిందువులు కాని వారు ఇక్కడికి రాకూడదని హెచ్చరించారు. వారణాసి హిందువులకు ప్రముఖ పుణ్యక్షేత్రం అని, ఇది పిక్నిక్ పాయింట్ కాదని పోస్టర్లలో హిందీలో రాశారు.

అందుకే ఇలా చేశాము.... భజరంగ్ దళ్

అందుకే ఇలా చేశాము.... భజరంగ్ దళ్

హిందువులు కాని వారు వారణాసికి ఇక్కడికి రాకూడదని హెచ్చరిస్తున్నామని వీహెచ్ పీ, భజరంగ్ దళ్ పేర్లతో పోస్టర్లు దర్శనం ఇవ్వడం కలకలం రేపింది. హిందువులు కానివారు వారణాసిలోని గంగా ఘాట్ లో స్వచ్చతను ఉల్లంఘిస్తున్నారని, వారిని హెచ్చరించడానికి ఇలా పోస్టర్లు వేశామని, వీడియోలు విడుదల చేశామని వారణాసిని స్వచ్చంగా పెట్టడానికి ఇలా చేశామని భజరంగ్ దళ్ కాశీ మహానగర్ కో ఆర్డినేటర్ నిఖిల్ త్రిపాఠి రుద్ర పీటీఐ వార్త సంస్థకు వివరణ ఇచ్చారు.

 ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజక వర్గం

ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజక వర్గం

ప్రధాని నరేంద్ర మోదీ ఇదే వారణాసి లోక్ సభ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇలా రెచ్చగొట్టే పోస్టర్లు వేశారని ఇంత వరకు ఎవ్వరూ లిఖితపూర్వకంగా కేసు పెట్టలేదని, మేమే రంగంలోకి దిగి పోస్టర్లు తొలగిస్తున్నామని స్థానిక సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు.

హిందూ ధర్మం.... భారతీయ సంస్కృతిని కాపాడుకుంటాం

హిందూ ధర్మం.... భారతీయ సంస్కృతిని కాపాడుకుంటాం

కొన్ని గ్రూప్ లో ఈ వార్నింగ్ వీడియోలును వైరల్ చెయ్యడంతో మాకంట్లో పడిందని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద వారణాసిలో వేసిన పోస్టర్లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. కాశీలోని గంగా ఘాట్ లు, అక్కడి దేవాలయాలు సనాతన ధర్మం, భారతీయ సంస్కృతికి ప్రతీకగా ఉన్నాయని, మా విశ్వాసాలు కాపాడుకోవడానికి ఇలా పోస్టర్లు వేశారని హిందూ సంఘాలు సమర్థించుకుంటున్నాయి.

English summary
Varanasi: Posters asking non-Hindus to stay away from the ghats of the Ganga and the temples along the river came up in Varanasi, prompting the police to launch a probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X