సొంత నియోజకవర్గానికి నరేంద్రమోడీ అదిరిపోయే గిఫ్ట్
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంపై భారతీయ రైల్వే దృష్టి సారించింది. ఇందులో భాగంగానే వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. సెమీ హైస్పీడ్ రైళ్లుగా వచ్చిన వందే భారత్ ప్రయాణికుల ఆదరణను చూరగొన్నాయి. కాకపోతే ఛార్జీలు మాత్రం కాస్తంత ఎక్కువగా ఉన్నాయనే అప ప్రథను మాత్రం మూటగట్టుకుంది.
ఎలివేటెడ్ ట్రాక్ : ఈ కోవలోనే బుల్లెట్ రైలును ప్రవేశపెట్టబోతోంది. ప్రస్తుతం ముంబయి-అహ్మదాబాద్ మధ్య నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2026లో ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ నుంచి కాశీకి కూడా బుల్లెట్ రైలు రాబోతోంది. ఈమేరకు భారతీయ రైల్వే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సూపర్ గిఫ్ట్ ను ప్రకటించింది. ఎలివేటెడ్ ట్రాక్ (పై నుంచి వెళ్లే మార్గం)తో పాటు అండర్ గ్రౌండ్ స్టేషన్లను నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

గంటకు 330 కిలోమీటర్ల వేగం : ఈ మార్గానికి సంబంధించి సర్వే పనులు కూడా పూర్తయ్యాయి. ప్రాజెక్టు పనులు 2024 నాటికి పూర్తవుతాయంటున్నారు. 958 కిలోమీటర్ల పొడవుండే ఈ ట్రాక్ మార్గంలో 13 స్టేషన్లు ఉంటాయి. అందులో 12 యూపీలోనే నిర్మాణం జరుపుకుంటాయి. లక్నో నుంచి అయోధ్య ను కలుపుతూ 123 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం కూడా ఇందులో భాగంగానే ఉండనుంది. గంటకు 330 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైలు నడుస్తుంది. ప్రత్యేక ట్రాక్ లు, ప్రత్యేక స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. కాశీతోపాటు అయోధ్య, ఆగ్రాను కూడా హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా కలపబోతున్నారు.
అండర్ గ్రౌండ్ స్టేషన్ : ఢిల్లీ-వారణాసి మధ్య ఒక రోజులో 18 ట్రిప్పులు ఉంటాయి. ఢిల్లీ నుంచి ఆగ్రా మధ్య 63 ట్రిప్పులు, ఢిల్లీ నుంచి లక్నో మధ్య 43 ట్రిప్పులు, ఢిల్లీ నుంచి అయోధ్య మధ్య 11 ట్రిప్పులు ఉంటాయి. నోయిడాలోని జేవార్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో అండర్ గ్రౌండ్ స్టేషన్‌ను నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications