Variety: అర్దరాత్రి 12 గంటలకు స్మశానంలో కేక్ కటింగ్, బిర్యానీలు, లేడీస్ మద్యలో బర్త్ డే పార్టీ, కేక !
ముంబాయి/థాణే: గతంలో సెలబ్రిటీలు, శ్రీమంతులు, కోటీశ్వరులు, రాజకీయ నాయకులు చాలా గ్రాండ్ గా బర్త్ డే పార్టీలు జరుపుకునేవారు. ఇప్పుడు దాదాపుగా అందరూ బర్తడే పార్టీలు చేసుకుంటున్నారు. స్టార్ హోటల్స్, రిసార్ట్స్, రెస్టారెంట్ లు, ఫంక్షన్ హాల్స్ లో, కొందరు వారివారి ఇళ్లల్లో బర్త్ డే పార్టీలు జరుపుకుంటున్నారు. ఎవరి స్థోమతకు తగ్గట్లు వారు విందులు, మందు పార్టీలు ఇస్తున్నారు. ఇక్కడ ఓ వ్యక్తి అతని బర్త్ డే పార్టీని స్మశానంలో జరుపుకున్నాడు. అర్దరాత్రి 12 గంటలకు స్మశానంలో బర్త్ డే పార్టీ జరుపుకోవడమే కాకుండా బిర్యానీలు పెట్టి, స్వీట్లు పంచిపెట్టి హాట్ టాపిక్ అయ్యాడు.

గ్రాండ్ గా బర్త్ డే పార్టీలు
దేశంలో బర్త్ డే పార్టీలు గ్రాండ్ గా జరుపుకునేవాళ్లను మనం నిత్యం చూస్తుంటాము. స్టార్ హోటల్స్, రిసార్ట్స్, రెస్టారెంట్ లు, ఫంక్షన్ హాల్స్ లో అదిరిపోయే లెవల్లో బర్త్ డే పార్టీలు నిర్వహిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఇళ్లల్లో బర్త్ డే పార్టీలు జరుపుకుంటున్నారు. ఎవరి స్థోమతకు తగ్గట్లు వారు విందులు, మందు పార్టీలు ఇస్తున్నారు.

స్మశానంలో బర్త్ డే పార్టీ
మహారాష్ట్రలోని థాణే జిల్లాలోని కల్యాణ్ నగరంలో గౌతమ్ మోరే అలియాస్ గౌతమ్ (54) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 53 సంవత్సరాలు పూర్తి చేసుకుని 54వ వసంతంలోకి అడుగుపెడుతున్న గౌతమ్ మోరే అతని బర్త్ డే పార్టీ కల్యాణ్ నగరంలోని స్మశానవాటికలో నిర్వహించాలని డిసైడ్ అయ్యాడు.

అర్దరాత్రి 12 గంటలకు కేక్ కటింగ్
స్మశానంలో కరెక్ట్ గా అర్దరాత్రి 12 గంటల సమయంలో పెద్ద ఎత్తున కొవ్వోత్తులు వెలిగించి భారీ కేక్ కట్ చేసిన గౌతమ్ మోరే అతని పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. గౌతమ్ మోరే బర్త్ డే వేడుకలకు అతని స్నేహితులు, మహిళలు, పిల్లలతో సహ 100 మందికి పైగా హాజరైనారని ప్రముఖ మీడియా పీటీఐ తెలిపింది.

బిర్యానీలు, కేక్ లతో గ్రాండ్ గా పార్టీ
గౌతమ్ మోరే అతని పుట్టిన రోజు వేడుకలకు హాజరైన వారికి స్మశానంలోనే రుచికరమైన బిర్యానీలు వడ్డించాడు. అందరికి కేక్ లు, స్వీట్లు పంచిపెట్టాడు. తాను బర్త్ డే వేడుకలు ఫక్షన్ హాల్ లో, రిసార్ట్ లో జరుపుకోవాలని చాలా మంది సూచించారని, అయితే తాను స్మశానంలో బర్త్ డే పార్టీ జరుపుకోవడానికి బలమైన కారణం ఉంది గౌతమ్ మోరే అన్నారని పీటీఐ తెలిపింది.

మూడనమ్మకాలు పోవాలి
స్మశానంలో అడుగుపెడితే లేనిపోని సమస్యలు వస్తాయని, అక్కడ చేతబడులు చేస్తారని, అక్కడికి వెళ్లి వస్తే చెడు జరుగుతుందని చాలా మంది మూడనమ్మకాలతో ఉన్నారని గౌతమ్ మోరే విచారం వ్యక్తం చేశారు. అలాంటి మూడనమ్మకాలు ప్రజల్లో పోవాలని, స్మశానంలో కూడా శుభకార్యాలు జరుపుకోవచ్చిన చెప్పడానికే తాను ఇక్కడ పుట్టినరోజు వేడుకలు నిర్వహించానని గౌతమ్ మోరే చెప్పారని పీటీఐ తెలిపింది. మొత్తం మీద స్మశానంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న గౌతమ్ మోరే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications